Ginger Beauty: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు

అల్లం చాలా మంచిది. అల్లం ర‌సంలో తేనె క‌లిపి ముఖానికి రాసుకుంటే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతాయి. చ‌ర్మంపై గాయాల మ‌చ్చలు ఉంటే అల్లం ర‌సంలో నిమ్మర‌సం క‌లిపి రాస్తే గాయాల మ‌చ్చలు, చ‌ర్మంపై ఉండే న‌ల్ల మ‌చ్చలు త‌గ్గుతాయి.

New Update
Ginger Beauty: అల్లంతో మన ముఖంపై అద్భుతాలు.. ఒక్క ముక్క అల్లం చాలు

Ginger For Beauty: వంటల్లో రారాజు అంటే అల్లం అనే చెప్పాలి. ఎందుకంటే అల్లం వేయని కూర లేదు. అల్లం కూరల్లో రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అల్లంలో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలున్నాయి. చాలామంది అల్లం టీని, అల్లం ర‌సాన్ని తాగుతారు. అల్లాన్ని ఏ రూపంలో తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచే చేస్తుంది. అల్లాన్ని తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను దూరమై.. చ‌క్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే.. అల్లం కేవ‌లం శ‌రీర ఆరోగ్యానికే కాదు చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంతో దోహ‌దం చేస్తుంది. అల్లం చ‌ర్మ స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో, చ‌ర్మం రంగును మెరుగుప‌ర‌చ‌డంలో బాగా పనిచేస్తుంది. ఎలాంటి చ‌ర్మత‌త్వం ఉన్నవారైనా అల్లాన్ని వాడవచ్చు. అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, చ‌ర్మంపై ముడ‌త‌లలు, వృద్దాప్య ఛాయ‌లు ద‌రి చేర‌కుండా స‌హాయ‌ప‌డుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ప్లామేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, గుణాలు అధికంగా ఉన్నాయి.  అల్లం వల్ల కలిగే ఉప‌యోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: నరాల సమస్యతో బాధపడే వారికి ఎండుకొబ్బరి వరం
చ‌ర్మంపై ఇన్ ప్లామేష‌న్‌తోఇబ్బంది పడుతూ ఉంటే అల్లం ముక్కను తీసుకుని చ‌ర్మం ఉబ్బిన చోట నెమ్మదిగా రుద్దాలి. దీనిని 30 నిమిషాలు ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. అంతేకాకుండా.. కొంద‌రిలో క‌ళ్ల చుట్టూ ఉబ్బిన‌ట్టుగా, ఎర్రగా ఉంటే అల్లం టీ బ్యాగ్‌ల వ‌ల్ల మంచి ఫ‌లితం వస్తుంది. టీ బ్యాగ్‌ల‌ను ప‌డేయ‌కుండా క‌ళ్లపై 5 నిమిషాలు ఉంచితే క‌ళ్ల చుట్టూ ఉండే ఉబ్బుద‌నం త‌గ్గిపోతుంది. అలాగే మొటిమ‌ల స‌మ‌స్య ఉంటే అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చక్కటి ఫ‌లితం వస్తుంది.
అల్లంతో ఇలా చేయండి
అల్లం ర‌సంలో తేనె క‌లిపి మొటిమ‌ల‌పై రాసి 30 నిమిషాల త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతాయి. చ‌ర్మంపై గాయాల మ‌చ్చలు ఉంటే అల్లం ర‌సంలో నిమ్మర‌సం క‌లిపి గాయాల మ‌చ్చల‌ దగ్గర రాయాలి. ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే గాయాల మ‌చ్చలు, చ‌ర్మంపై ఉండే న‌ల్ల మ‌చ్చలు త‌గ్గుతాయి. అలాగే.. అల్లం ర‌సంలో కొద్దిగా పెరుగు వేసి క‌లిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం అందంగా, చ‌ర్మం రంగు మెరుగుపడుతుంది.  అయితే.. కొందరిలో అల్లం వాడితే చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌చ్చే ఛాన్స్‌ ఉంది. క‌నుక అల్లం ర‌సాన్ని ఉప‌యోగించే ముందు చ‌ర్మంపై రాసుకుని 10 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఎలాంటి స‌మ‌స్య లేనిపోతే అల్లాన్ని వాడుకోవాలి. ఇంక ఏమైనా సమస్యలుంటే ముందు డాక్టర్ల సలహా తీసుకోవటం మంచిది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు