Brunei Prince: సామాన్యూరాలిని పెళ్లి చేసుకున్న బ్రూనై రాజకుమారుడు..

బ్రూనై దేశ రాజకుమారుడు అబ్దుల్ మతీన్ (32).. యంగ్ మాలియా అనిషా రోస్నా(29) అనే ఓ సామాన్య మహిళను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Brunei Prince: సామాన్యూరాలిని పెళ్లి చేసుకున్న బ్రూనై రాజకుమారుడు..
New Update

సాధారణంగా ధనవంతులు మరో ధనవంతుల కుటుంబంలో ఉన్న వ్యక్తులనే పెళ్లిల్లు చేసుకుంటారు. స్థాయి, హోదాను చూసి వివాహం చేసుకునే ఈరోజుల్లో.. ఓ దేశ రాకుమారుడు సామాన్య మహిళను పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రూనై దేశ రాజకుమారుడు అబ్దుల్ మతీన్ (32).. యంగ్ మాలియా అనిషా రోస్నా(29) అనే ఓ సామాన్య మహిళను పెళ్లి చేసుకున్నారు. బ్రూనై రాజు అసల్ అల్ బోల్కియా ప్రపంచలోనే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న చక్రవర్తిగా కొనసాగుతున్నారు.

Also Read: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్‌ స్కెచ్‌..

ఒకప్పుడు ఈయన ప్రపంచంలోనే సంపన్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన పదో సంతానమే అబ్దుల్ మతీన్. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న యంగ్ మాలియా అనే మహిళ.. సుల్తాన్ ముఖ్య సలహాదారుల్లో ఒకరి మనువరాలు. అయితే ఆమెకు ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. అలాగే ఓ పర్యాటక సంస్థకు కూడా ఆమె యజమాని. మతీన్, మాలియా వీళ్లిద్దరూ బ్రూనై రాజధాని బందార్‌ సెరీ బెగవాన్‌లోని ఓ బంగారు గుమ్మటపు మసీదులో వివాహం చేసుకున్నారు.

మరో విషయం ఏంటంటే అబ్దుల్ మతీన్‌కు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. ఆయన యుద్ధ విమనాలు, స్పీడ్‌ బోట్లను కూడా నడిపిస్తారు. వర్కౌట్స్ చేసిన తర్వాత ఫిట్‌నెస్‌ ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. ఇక మతీన్ తన తండ్రితో కలిసి ఎక్కువగా విదేశీ పర్యటనల్లోనే కనిపిస్తారు. వాస్తవానికి బ్రూనై అనేది ఒక ఇస్లామిక్ రాజ్యం. వీరి రాజకుటుంబం ఇప్పటికే కుంభకోణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయినప్పటికీ కూడా మతీన్‌కు మాత్రం మంచి యూత్‌ ఫాలోయింగ్ ఉంది.

Also Read: మా రాష్ట్రం పేరును అలా మార్చండి.. సీఎం మమతా బెనర్జీ డిమాండ్..

#telugu-news #international-news #brunei-prince
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe