ఓవైపు ఉక్రెయిన్- రష్యా, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండొచ్చని పలువురు విశ్లేషకులు ఇటీవల అంచనా వేసిన సంగతి సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉత్తర కొరియా.. ప్రపంచ దేశాలకు కీలక ఆదేశం చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను పూర్తిగా వినాశనం చేస్తామని ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Also Read: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం
అణుయుద్ధానికి అమెరికా, దక్షిణ కొరియాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అధినేత నుంచి ఆదేశాలు వస్తే ఎలాంటి ఆలస్యం చేయకుండా శత్రువులను పూర్తిగా నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా సైనికాధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఇదిలాఉండగా.. దక్షిత కొరియాతో మూడేళ్ల పాటు జరిగిన యుద్ధానికి విరామమిస్తూ.. 1953లో జులైన 27న అమెరికా, చైనాలతో కలిసి ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవంగా ఉత్తర కొరియా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తోంది. దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది. ఈ యుద్ధ విరామానికి ఒప్పందం జరగకపోవడం వల్ల సాంకేతికంగా ఇరుదేశాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లేనని భావిస్తున్నాయి.
Also Read: బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు గత కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడం, అలాగే 2019 నుంచి అణునిరాయిధీకరణపై చర్చలు కూడా నిలిచిపోయాయి. అయితే అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎవరు వచ్చినా కూడా ఈ పరిణామంలో మార్పు ఉంటుందని ఆశించడం లేదని ఉత్తర కొరియా ఇటీవలే ప్రకటించింది.