రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారంటున్న ఖర్గే..ఏంది సామి ఇది!

రాజస్థాన్‌ లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నోరు జారారు. రాజీవ్‌ గాంధీ పేరుకి బదులు రాహుల్‌ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఆర్పించారు అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యాలు కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

New Update
రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారంటున్న ఖర్గే..ఏంది సామి ఇది!

ఏందో ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. తాము మాట్లాడింది పొరపాటు అని తెలిసే లోపే అవి కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టేస్తాయి. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్న ఓ మాట ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఖర్గే రాజీవ్‌ గాంధీ పేరును చెప్పబోయి రాహుల్‌ గాంధీ అని చెప్పారు. దీంతో ఆయన ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనూప్‌గఢ్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే పాల్గొని మాట్లాడారు. '' రాహుల్‌ గాంధీ వంటి నాయకులు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు'' అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఖర్గే పొరపాటును గ్రహించిన ఇతర నేతలు వెంటనే ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో మళ్లీ వెంటనే తన వ్యాఖ్యలను సరి చేసుకున్నారు. దీంతో ఆయన రాజీవ్‌ గాంధీ పేరుకు బదులు పొరపాటున రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చారు. అందుకు గానూ తనను క్షమించాలని కోరారు.

రాజీవ్‌ గాంధీ వంటి నేతలు జాతి సమైక్యత కోసం ప్రాణాలు ఆర్పించారు. కాంగ్రెస్‌ లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులు ఉన్నారు. కానీ బీజేపీలో మాత్రం ప్రాణాలు తీసే నేతలు ఉన్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన అన్న మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లతో పాటు , పలువురు నేతలు కూడా ఖర్గే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన ప్రసంగం వీడియోను షేర్‌ చేస్తూ '' అలా ఎప్పుడు జరిగింది..? అంటూ చురకలంటిస్తున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడవుతాయి.

Also read: కొవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు..ఐసీఎంఆర్ ఏమని చెప్పిందంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు