బాయిల్డ్ ఎగ్ కంటే ఆమ్లెట్ లోనే ఎక్కువ పోషకాలుంటాయా!

అల్పాహారంలో అతి ఎక్కువమంది ఇష్టపడే ఫుడ్ లో గుడ్డు ఒకటి. అధిక ప్రొటీన్స్ కలిగివుండే ఆహార పదార్థాల్లో ఒకటైన ఈ ఎగ్ ను చాలామంది రకరకాలుగా తింటుంటారు. అయితే ఇందులో ఉడికించిన గుడ్డు కంటే ఆమ్లెట్ లోనే అధిక పోషకాలు ఉంటాయంటున్నారు ఫుడ్ ఎక్స్ పర్ట్స్.

బాయిల్డ్ ఎగ్ కంటే ఆమ్లెట్ లోనే ఎక్కువ పోషకాలుంటాయా!
New Update

అల్పాహారంలో అతి ఎక్కువమంది ఇష్టపడే ఫుడ్ లో గుడ్డు ఒకటి. అధిక ప్రొటీన్స్ కలిగివుండే ఆహార పదార్థాల్లో ఒకటైన ఈ ఎగ్ ను చాలామంది రకరకాలుగా తింటుంటారు. అయితే ఇందులో ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయంలో చాలా మందికి ఎన్నో సందేహాలున్నాయి. కొంతమంది ఆఫ్ బాయిల్డ్ అంటే మరికొందరూ పూర్తిగా ఉడికించినదే ఉత్తమని చెబుతుంటారు. మరి ఈ విషయంలో ఫుడ్ ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారు. ఏ పద్ధతిలో గుడ్డు తింటే ప్రొటిన్స్ అందుతాయంటున్నారో తెలుసుకుందాం.

బాయిల్డ్ ఎగ్ :
నిజానికి ఉడికించిన గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది ఇలా తినడానికి ఇష్టపడరు. బాయిల్డ్ ఎగ్ సుమారు 78 కేలరీలను కలిగి ఉంటుంది. ఇది ప్రోటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు శరీర పెరుగుదల కోసం అవసరమైన దాదాపు 6 గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ D, B12 కూడా అధికంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పోషకం కోలిన్ ఉడికించిన గుడ్డులో పుష్కలంగా ఉంటుంది.

ఆమ్లెట్ :
ఆమ్లెట్స్ చాలా రకాలుగా ట్రై చేస్తారు. అదనపు నూనె, వెన్న లేదా చీజ్ జోడించి ఆమ్లెట్ పోషక విలువలను పాడు చేస్తుంటారు. కానీ ఆమ్లెట్‌లో కూరగాయలు జోడించడం వల్ల దాని పోషక విలువలు పెరుగుతాయి. వీటి కారణంగా ఆమ్లెట్‌లు అధిక ప్రోటీన్ కంటెంట్‌ను అందించగలవు. కాబట్టి ఉడకబెట్టిన గుడ్ల కంటే ఆమ్లెట్‌లో ఎక్కువ ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. కానీ అదనపు నూనె ఉంటే ఆమ్లెట్ దాని పోషక విలువను కోల్పోతుంది. నామమాత్రపు నూనెలో వేయించిన ఆమ్లెట్, కాలానుగుణ కూరగాయలతో యాడ్ చేస్తే ప్రత్యేకమైన పోషకాలను అందిస్తుంది.

Also read :కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్.. వెల్లడించిన లేటెస్ట్ స్టడీ

పోషక విలువలు :
స్వచ్ఛమైన పోషకాహారం పరంగా ఉడికించిన గుడ్డు దాని సహజ పోషకాలను చాలా వరకు నిలుపుకుంటుంది. ఎందుకంటే గుడ్డుని ఉడికించడం మూలంగా అందులోని ప్రోటీన్లు, పోషకాలు సురక్షితంగా ఉంటాయి. కానీ ఆమ్లెట్‌లో నూనె వాడటం మూలంగా కొంత వరకు క్యాలరీలు తగ్గుతాయి. కానీ అందులో కొన్ని కూరగాయలు యాడ్ చేసుకుని తింటే కనుక పోషకాలు మరింత ఎక్కువగా అందుతాయి.

రోజుకు ఎన్ని తీసుకోవాలి :
ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి, రోజుకు రెండు మూడు గుడ్లు తినడం వల్ల శరీరానికి దాదాపు 14 నుంచి 21 గ్రాముల ప్రొటీన్లు అందుతాయి. కొంచెం బలహీనంగా ఉన్న వారు రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు తీసుకోవాలి. ఇది వారి ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. కానీ ప్రతి ఒకరు వారి ఆరోగ్య పరిస్థితులను చూసుకుని తినాలి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ముందుగా డాక్టర్లని అడిగి తర్వాత తినడం మంచిది.

ఆరోగ్యకరమైన ఆమ్లెట్ టిప్స్ :
ఆరోగ్యకరమైన ఆమ్లెట్ కావాలి అంటే అందులో పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను చేర్చడంపై దృష్టి పెట్టండి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి గుడ్డులోని తెల్లసొన మిశ్రమాన్ని ఎంచుకోండి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల కోసం బచ్చలికూర, టొమాటొ ముక్కలు, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలతో మీ ఆమ్లెట్‌‌కు యాడ్ చేయండి. వెన్నకు బదులుగా గుండెకు ఆరోగ్యకరమైన ఆలివ్ నూనెను వాడండి.

ఏ సమయంలో తినాలి :
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్ టైమ్ గుడ్లు తినడానికి ఉత్తమ సమయం. దీనివల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎందుకంటే ఇందులో శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే శక్తిని పెంచి, మధ్యాహ్నం భోజనం టైం వరకు ఆకలిని తగ్గిస్తాయి. ఇది కాకుండా వ్యాయామం చేసిన కొంత సమయం తర్వాత గుడ్లు తినవచ్చు. గుడ్డులో ప్రోటీన్ కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.

#benfits #boiled-egg #omelette #products #healthier
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe