లోక్‌సభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలిసారి విపక్ష నేతగా పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన మాట్లాడేముందు బీజేపీ నేతలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా.. రాహుల్ జై సంవిధాన్ అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. అయితే ప్రసంగంలో రాహుల్ గాంధీ శివుని ఫొటో చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను శివుని నుంచి ప్రేరణ పొందానని వ్యాఖ్యానించారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఖండించారు. సభలో ఎలాంటి ప్రకార్డులు లేదా గుర్తులు చూపించకూడదని అన్నారు.
పూర్తిగా చదవండి..Also Read: భారీ వర్షాలు..నడి రోడ్డు పై మొసలి హల్చల్!
రాహుల్ గాంధీ.. శివుని చిత్రపటాన్ని చూపడాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా తప్పుబట్టారు. ఇది హిందూ సమాజంపై దాడి అంటూ అభ్యంతరం తెలిపారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. మళ్లీ దీనిపై స్పందించిన రాహుల్.. హిందూ కమ్యూనిటీ అంటే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదని కౌంటర్ ఇచ్చారు. అలాగే మన నాయకులు.. అహింస, భయాన్ని పాలద్రోలే అంశాల గురించి మాట్లాడారని.. తమకు తామే హిందువులు అని పిలుచుకుంటున్నవారే హింస, విద్వేషం, అసత్యాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాహుల్ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘ అయోధ్య బీజేపీకి ఓ సందేశం ఇచ్చింది. బీజేపీ అక్కడ రామమందిరాన్ని ప్రారంభించింది. అయోధ్యలో ప్రజల నుంచి భూములు లాక్కున్నారు. కానీ వారికి పరిహారం మాత్రం ఇవ్వలేదు. చాలా ఇళ్లను కూల్చేసి వాళ్లను రోడ్డుపై నిలబెట్టారు. రామ మందిరం ప్రారంభోత్సవంలో అదానీ, అంబానీలు ఉన్నారు. కానీ అయోధ్య ప్రజలకు ప్రాతినిథ్యం లభించలేదు. దీంతో అయోధ్య ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. కానీ సర్వే సంస్థలు మోదీని వారించాయి. అయోధ్యలో పోటీ చేస్తే ఓడిపోతారని చెప్పాయి. అందుకే మోదీ వారణాసికి పారిపోయారు.
Also read: వర్షాలు.. వరదలతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి
అనురాగ్ ఠాకూర్ కూడా అయోధ్య గురించి మాట్లాడారు. అందుకే నేను కూడా అయోధ్య గురించి మాట్లాడుతున్నాను. ధరల పెరుగుదల వల్ల దేశంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్నివీర్ అంటే యూజ్ అండ్ త్రో, ఇది మోడీ విధానం. అగ్నివీర్లకు సరైన ట్రైనింగ్ అందడం లేదు. ఇదేం దేశభక్తి. ట్రైనింగ్ లేకపోతే చైనాను అగ్నివీర్ ఎలా ఎదుర్కొంటారు. ఫిల్మ్ స్టార్, బాలీవుడ్ స్టార్లతో ఫోటోలు దిగుతారు. చైనాలో సైనికులకు ఐదేళ్లు ట్రైనింగ్ ఇస్తారు. అగ్నివీర్ స్కీం మోదీ ఆలోచన, రక్షణ శాఖ ఆలోచన కాదు. నోట్ల రద్దు తరహాలోనే అగ్నివీర్ స్కీంను తీసుకువచ్చారు. అగ్నివీర్ లాంటి విధానం చాలా దేశాల్లో ఉంది, యూరప్‌లో కూడా ఉందని’ రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు రాహుల్ ప్రసంగంపై అమిత్ షా స్పందించారు. సభలో అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. అగ్నివీర్లకు రాహుల్ సారీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అగ్నివీర్ ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం ఇస్తామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మళ్లీ రాహుల్ మాట్లాడుతూ.. ‘మణిపూర్‌ను అల్లర్లలో ముంచారు. మీ రాజకీయాల కోసం ఆ రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఇప్పటివరకూ మోదీ మణిపూర్‌కు వెళ్లలేదు. మణిపూర్ దేశంలో భాగం కాదా. ప్రధాని మోదీకి మణిపూర్ సమస్య కనిపించడం లేదా. మోదీ, అమిత్ షా మణిపూర్ సమస్యను పట్టించుకోవడం లేదు. మీకు సిగ్గు రావా. దేవునితో మాట్లాడతానని మోదీనే స్వయంగా చెప్పారు. నేను బయోలాజికల్ కాదు అని మోదీనే చెప్పారు. నోట్ల రద్దు చేయాలని మోదీకి దేవుడే చెప్పి ఉంటాడు
చిన్న,మధ్య తరహా పరిశ్రమలు ఎత్తివేస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు బ్యాక్‌బోన్‌లాంటి పరిశ్రమలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్ల కోసమే మోదీ పని చేస్తారు. గుజరాత్లో మిమ్మల్ని ఓడిస్తాం, రాసిపెట్టుకొండి. భూ సేకరణ కోసం కొత్త చట్టం తీసుకువచ్చారు. రైతులకు మేలు జరుగుతుందని మోదీ చెప్పారు. నిజం ఏంటంటే అదానీ, అంబానీలకు మేలు చేసేలా చట్టం తెచ్చారు. ఆందోళన చేసిన రైతులను ఉగ్రవాదులన్నారని’ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 700 మంది రైతులు అమరులయ్యారు. కనీసం వారి కోసం నివాళి కూడా అర్పించలేదు. మోదీ 16 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేశారు. రైతులు తమకు కూడా రుణమాఫీ అడిగారు. MSP కావాలని రైతులు అడిగారు. మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి. నోట్ల రద్దు, GST, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్స్‌ను కమర్షియల్‌గా మార్చారు. ఇందుకు నీట్ ఉదాహరణ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిభ ఉన్న విద్యార్థి మెడికల్ సీటు పొందలేడు. కేవలం డబ్బున్న వాళ్లకే సీట్లు వచ్చేలా చేశారు.
Also read: కొత్త చట్టాలతో సరికొత్త చిక్కు.. వారికి రక్షణ ఎక్కడ?
మైనార్టీలను బీజేపీ భయపెడుతోంది. మీరు మమ్మల్ని భయపెట్టలేరు. మమ్మల్ని చూసే మీరు భయపడుతున్నారు. మైనార్టీలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. నిజాన్ని మీరు ఎప్పటికీ అడ్డుకోలేరు. దేశ ప్రజలే కాదు, మీ పార్టీలో నేతలు కూడా భయపడుతున్నారు. నా మాటలను మీరు కూడా అంగీకరిస్తున్నట్లే అనిపిస్తోంది. నేను కేవలం కాంగ్రెస్ ప్రతినిధిని కాదు, ఇండియా కూటమికి ప్రతినిధిని. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేనివాడే నిజమైన పబ్లిక్ రిప్రజెంటేటివ్. ప్రతిపక్షాన్ని శత్రువుల్లా చూడొద్దు. ఇవే శివుడి సిద్ధాంతాలు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తామని’ రాహుల్ అన్నారు.
[vuukle]