Lok Sabha Speaker: ఎన్డీయే స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా (Om Birla) నామినేషన్ వేశారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో (PM Modi) ఓం బిర్లా సమావేశమయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ ఎన్డీయే (NDA) విపక్షాలను కోరింది. దీనికి విపక్షాలు నో చెప్పాయి. లోక్ సభ స్పీకర్ ఎన్నికల బరిలో ఇండి కూటమి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి కేరళ ఎంపీ సురేష్ (Congress MP K Suresh) నామినేషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటికి వరకు జరిగిన లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికల ఏకగ్రీవం అయింది. కాగా 75 ఏళ్ళ దేశ చరిత్రలో లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కానుంది.
పదవి ఇవ్వమంటే ఇవ్వరా?
ఎన్డీయే బలపర్చిన స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు తెలిపి.. ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఎన్డీయే విపక్షాలను కోరింది. కాగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే మద్దతు తెలపనునట్లు ఇండి కూటమి డిమాండ్ చేసింది. దీనికి ఎన్డీయే కూటమి నో చెప్పడంతో లోక్ సభ స్పీకర్ పదవి రేసులో తాము కూడా పోటీ చేస్తున్నట్లు ఇండి కూటమి చెప్పింది. తమ అభ్యర్థిని బరిలో నిలిపింది.