BREAKING: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికలో బిగ్గెస్ట్ ట్విస్ట్.. భారత చరిత్రలోనే తొలిసారి! లోక్ సభ స్పీకర్ ఎన్నికలో ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీయే, ఇండి కూటమి పోటీ పడనున్నాయి. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్డీయే నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. By V.J Reddy 25 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Lok Sabha Speaker: ఎన్డీయే స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా (Om Birla) నామినేషన్ వేశారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో (PM Modi) ఓం బిర్లా సమావేశమయ్యారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ ఎన్డీయే (NDA) విపక్షాలను కోరింది. దీనికి విపక్షాలు నో చెప్పాయి. లోక్ సభ స్పీకర్ ఎన్నికల బరిలో ఇండి కూటమి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నుంచి కేరళ ఎంపీ సురేష్ (Congress MP K Suresh) నామినేషన్ దాఖలు చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఇప్పటికి వరకు జరిగిన లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికల ఏకగ్రీవం అయింది. కాగా 75 ఏళ్ళ దేశ చరిత్రలో లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కానుంది. BJP MP Om Birla files his nomination for the post of Speaker of the 18th Lok Sabha NDA has fielded Om Birla, INDIA bloc has fielded Congress MP K Suresh for the post of Speaker pic.twitter.com/huC271xmxm — ANI (@ANI) June 25, 2024 పదవి ఇవ్వమంటే ఇవ్వరా? ఎన్డీయే బలపర్చిన స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు తెలిపి.. ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఎన్డీయే విపక్షాలను కోరింది. కాగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే మద్దతు తెలపనునట్లు ఇండి కూటమి డిమాండ్ చేసింది. దీనికి ఎన్డీయే కూటమి నో చెప్పడంతో లోక్ సభ స్పీకర్ పదవి రేసులో తాము కూడా పోటీ చేస్తున్నట్లు ఇండి కూటమి చెప్పింది. తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. नरेंद्र मोदी कहते कुछ हैं और करते कुछ हैं। ये इनकी रणनीति है, लेकिन इन्हें इसे बदलना ही पड़ेगा। क्योंकि पूरा देश जानता है कि PM मोदी के शब्दों का कोई मतलब नहीं है। : @RahulGandhi जी pic.twitter.com/loKS2i9693 — Congress (@INCIndia) June 25, 2024 #congress #om-birla #nda #lok-sabha-speaker మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి