Children Food: పిల్లలలో ఆకలి కోల్పోవడం అనేది ఒక సాధారణ సమస్య. ప్రతి తల్లిదండ్రులు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు. ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టినా పిల్లలు మాత్రం తినరు. దీంతో తల్లిదండ్రులు గందరగోళంలో పడుతుంటారు. ఆకలి అయ్యేందుకు కొన్ని రకాల టానిక్‌లు కూడా ఇస్తుంటారు. ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యానికి మాత్రమే కాదు వారి అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆకలిని కోల్పోవడానికి కారణాలు భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు అకాల ఆహారం, ఒత్తిడి, తక్కువ నిద్ర లేదా అనారోగ్యం కూడా దీనికి కారణం. కానీ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని అంటున్నారు.
తినే సమయం ముఖ్యం:
పిల్లలకు ప్రతిరోజూ ఒకే సమయంలో ఆహారం ఇస్తే వారి శరీరం ఆ సమయానికి తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అంతేకాకుండా వాళ్లు ఆకలితో ఉంటారు. ఆహారంపైనా ఇష్టాన్ని చూపిస్తారు. ఒకే సమయంలో ఆహారం ఇవ్వడం వల్ల పిల్లల ఆహారపు అలవాట్లను మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
రుచికరమైన, రంగుల ఆహారం:
పిల్లలు ఎక్కువగా టేస్టీగా, కలర్ ఫుల్‌గా ఉండే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. అందుకే వారికి ఆహారాన్ని వండినప్పుడల్లా దానిని ఆకర్షణీయంగా, రుచికరమైనదిగా చేయడానికి ప్రయత్నించాలి. కూరగాయలను వివిధ ఆకారాలలో కత్తిరించడం, వివిధ రంగుల ఆహారాలను వారికి ఇవ్వడం వల్ల పిల్లలకు ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
కొద్దిగా ఆహారం ఇవ్వాలి:
పిల్లల ముందు ఎక్కువ ఆహారం పెడితే వారు తినడానికి ఇష్టపడరు. అందుకే వారి ప్లేట్‌లో తక్కువ మొత్తంలో ఆహారం ఇవ్వడం మంచిది. దీంతో సులువుగా తింటారు. తినాలనే ఆసక్తి కూడా పెరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
కలిసి భోజనం చేయండి:
కుటుంబం మొత్తం కలిసి కూర్చుని ఆహారం తింటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అందరితో కలసి భోజనం చేయడం వల్ల పిల్లలు కూడా కొత్తవాటిని తినేందుకు ట్రై చేస్తారు. ఆహారం మీద ఆసక్తి కూడా కనబరుస్తారని నిపుణులు అంటున్నారు.
జంక్ ఫుడ్ మానేయండి:
జంక్ ఫుడ్, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల పిల్లల్లో ఆకలి తగ్గుతుంది. దీంతో వారికి సరైన పోషకాహారం కూడా అందడం లేదు. అందుకే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన వాటిని అందించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: త్వరలో మార్కెట్‌లోకి యమహా RX 100?..నిజంగానే వస్తుందా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.