Oil Tanker Drivers:మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆపిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇండియన్ పీనల్ కోడ్‌ను మారుస్తూ కొత్త న్యాయసంహిత అనే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డైవర్లు ఆందోళనకు దిగారు. ఆ రూల్స్‌ను తొలగించాలని కోరుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరిపారు. వీళ్ళు రెండు రోజులుగా ధర్నా చేస్తుండడం వలన పెట్రోల్ బంకుల్కు చేరవలసిన ఆయిల్ ట్యాంకర్లు చేరలేదు. దీంతో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
Also Read:రన్‌వే మీద ఎయిర్ క్రాఫ్ట్‌ను ఢీకొన్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం
పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. పలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్ లలో వాహనదారులు నిల్చున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు.డీజిల్ మాత్రం పోయట్లేదని వాహనదారులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించి పోయింది. తాజాగా ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా విరమించడంతో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. కానీ, పెట్రోల్ బంకుల వద్ద రద్దీ మాత్రం అలాగే ఉంది.