Watch Video: వేప పుల్లతో 'ఇండియా-భారత్' వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో..

అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్‌పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Watch Video: వేప పుల్లతో 'ఇండియా-భారత్' వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో..
New Update

Lalu Prasad Yadav: అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్‌పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'(President of Bharat) పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు(Lalu Prasad Yadav) సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ జాతీయ న్యూస్ ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో లాలూ యాదవ్.. ఇండియా-భారత్‌ కు మధ్య వ్యత్యాసాన్ని చాలా క్లియర్‌గా అర్థమయ్యేలా ఒక వేప పుల్లను ఉదహరించి చెప్పారు. ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరడి పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేయగా అదికాస్తా మరింత వైరల్ అయ్యింది.

ఈ వైరల్ వీడియోలో RJD (రాష్ట్రీయ జనతాదళ్) చీఫ్, నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉదయాన్నే ఓ వే పుల్లతో పళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో మీడియా ప్రతినిథి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. భారత్-ఇండియా మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఢిల్లీలో వేప కొమ్మలు దొరుకుతాయా మీడియా ప్రతినిథి అడగగా.. 'ఢిల్లీ 'ఇండియా' కిందకు వస్తుంది.. పాట్నా 'భారత్' కిందకు వస్తుంది' కాబట్టి అక్కడ వేప పుల్లలు దొరకడం కష్టం అని బదులిచ్చారు లాలూ.

ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో..

జీ20 సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరఫున పంపిన విందు ఆహ్వాన ప్రతులపై ఇండియాకు బదులుగా భారత్ అధ్యక్షురాలిగా పేర్కొనడంతో ఇండియా పేరును భారత్‌గా మార్చవచ్చనే ప్రచారం మొదలైంది. విదేశీ ప్రతినిధుల కోసం ఉద్దేశించిన G20 బుక్‌లెట్‌లో కూడా 'భారత్‌' పదాన్ని పేర్కొన్నారు. 'భారత్ ది మదర్ ఆఫ్ డెమెక్రసీ' అని ఆ బుక్‌లెట్‌లో పేర్కొన్నారు. ఇంకా కీలకం ఏంటంటే.. నరేంద్ర మోదీని కూడా 'భారత్ ప్రధాని'గా పేర్కొన్నట్లుగా ఉన్న ఓ డాక్యూమెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలన్నీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌లో పేరు మార్పు ఊహాగానాలను పెంచింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రత్యేక సమావేశానికి కారణం ఏంటనేది ఇప్పటికీ చెప్పకపోవడం మరింత ఉత్కంఠను రేపుతోంది.

కేజ్రీవాల్ కామెంట్స్..

ఇక ఇండియా పేరు మార్పుపై విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతిపక్ష కూటమి 'ఇండియా' పేరు పెట్టిందనే కారణంతోనే కేంద్ర ప్రభుత్వం ఆ పేరును భారత్‌గా మారుస్తోందని, మరి విపక్ష కూటమి 'భారత్' అని పేరు పెడితే కేంద్రం అప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. విపక్ష కూటమి 'ఇండియా' అని పేరు పెట్టుకున్నంత మాత్రాన.. దేశం పేరునే మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఒక్క పార్టీకి చెందిందని కాదని, 140 కోట్ల మందిదని అన్నారు. కూటమి పేరును భారత్‌గా మార్చేస్తే.. వారు భారత్‌ను బీజేపీగా మార్చినా మార్చేస్తారని సెటైర్లు వేశారు కేజ్రీవాల్.

Also Read:

PM Narendra Modi: ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Nalgonda Suicide: అన్నా.. మందు తాగినం.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఆడియో వైరల్

#rjd #bjp #lalu-prasad-yadav #india #bharat
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe