Smart Watch : స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్..కేవలం రూ. 999లకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. ఈ స్మార్ట్ వాచ్ లో అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ వాచ్ 1.69 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే తో వస్తుంది. అంతేకాదు.. SpO2 ఫీచర్ కూడా ఉంది. ఆటో డిటెక్షన్‌తో 100 స్పోర్ట్స్ మోడ్స్ తోపాటు బ్యాటరీ 7 రోజులు వస్తుంది. కాల్స్ చేస్తూ ఉంటే.. బ్యాటరీ 2 రోజులు వస్తుంది కంపెనీ ప్రకటించింది.ఈ వాచ్‌కి షార్ప్, బ్రైట్ డిస్ప్లే ఉందని చెబుతోంది. మనకు అన్ని ప్రదేశాల్లో స్క్రీన్ బాగా కనిపించడంతోనాటు ఇది 240*280px డిస్ప్లేతోపాటూ 500 నిట్స్ కాంతిని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఇక ఈ వాచ్ పెద్దగా పవర్ వాడుకోకుండానే.. తేలిగ్గా సింక్ అవుతుందనీ, కంటిన్యూగా కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది. దీనికి బీటీ కాలింగ్ ఆప్షన్ ఉండటంతో = ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చు.ఈ స్మార్ట్ వాచీ.. హ్యాండ్ వాష్ రిమైండర్లు కలిగి ఉండటంతోపాటు ఐడిల్ అలర్ట్ కలిగివుంది. ఈ వాచ్ నీరు తాగమని రామైండ్ చేస్తుంది. వాతావరణం అప్ డేట్ ఇస్తుంది. అలారం కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ వాచీలో 150కి పైగా కస్టమైజ్డ్ ఫేసెస్ ఉండటంతో..రోజుకో కలర్, లుక్ ఉండేలా స్క్రీన్ థీమ్ మార్చుకునే అవకాశం ఉంది. రోజుకో కలర్ మార్చుకుంటే కొత్త వాచీలా కనిపిస్తుంది. ఇది 100 స్పోర్ట్స్ మోడ్స్తోపాటూ.. ఆటో స్పోర్ట్స్ డిటెక్షన్ తో వస్తుంది. అందువల్ల మీకు నచ్చే ఆటల వివరాల్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. క్రెకిట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.ఈ వాచీకి IP68 వాటర్ రెసిస్టాన్స్ ఉంది. ఇది నీటిలో పడినా కొంత సేపు పాడవదు. చెమట పట్టినా పాడవద్దు. ఈ వాచ్‌కి బ్యాటరీ కెపాసిటీ 300ఎంఏహెచ్ ఉంది. అందుకే 7 రోజులు వస్తుందని అంటున్నారు. ఈ వాచ్ మీకు 5 రంగుల్లో లభిస్తోంది.దీని అసలు ధర రూ.4,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 80 శాతం డిస్కౌంట్ ఇస్తూ, రూ.999కి అందుబాటులో ఉంది.