Tillu Square : అరే టిల్లు.. ఏందిరా.. ఈ క్రేజు..ఫ్యామిలీ స్టార్ ఫట్..రెండో వారంలోనూ సిద్దుదే హవా..! గత వారం రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద రూ. 100కోట్లకు చేరువలో ఉంది. నిన్న రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్..టిల్లుగాడి క్రేజుకు దివాలా పడినట్లే కనిపిస్తోంది. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కంటే టిల్లు స్క్వేర్ కే టికెట్లు ఎక్కువ బుక్ అవుతున్నాయి. By Bhoomi 06 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tillu Square Collections: టిల్లు స్క్వేర్..బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. టిల్లు గాడి క్రేజ్ ఏవిధంగా ఉందంటే..నిన్న రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీకి ఫట్ అయినట్లు అనిపిస్తోంది. రౌడీ బాయ్ సినిమాను నెటిజన్లు ఓ రేంజులో ఏకిపారేస్తున్నారు. ఇదేం సినిమారా బాబు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం తీసిందని..తమ టార్గెట్ రీచ్ అయిందంటూ సినిమా స్పందన బాగుందని దిల్ రాజ్ (Dil Raju), పరుశురామ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ బుక్ మై షోలో టికెట్ల హవా చూస్తుంటే మాత్రం అంత సీన్ లేదని అనిపిస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ కంటే గత వారం రిలీజ్ అయిన టిల్లుగాడీకి ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు టిల్లు స్వ్కేర్ మూవీకి 4.62K..ఫ్యామిలీ స్టార్ కు గంటకు 4.5k టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే టిల్లుగాడిని చూసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మామూలుగా కొత్తగా వచ్చిన సినిమాకు గతవారం వచ్చిన సినిమాకు తెగే టికెట్లలో ఏం తేడా లేదంటే విషయం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ స్టార్ కంటే టిల్లుగాడే చాలా బెటర్ అని జనాలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక టిల్లు ఇప్పటికే 100కోట్లకు దగ్గరలో ఉన్నాడు. ఫ్యామిలీ స్టార్ మూవీకి చాలా పూర్ ఓపెనింగ్స్ వస్తున్నాయంటూ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి అధికారిక లెక్కలను దిల్ రాజు బయటకు వదులుతాడో లేదో చూడాలి. ఫ్యామిలీ స్టార్ అసలే పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిందని తెలిసిందే.50కోట్ల షేర్ రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గతంలో వందల కోట్లు కొల్లగొడతానంటూ చెప్పాడు. మరి ఇలాంటి సినిమాలు వందల కోట్లు ఏమో కానీ..మినిమమ్ ఆడుతే చాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు. రెండు వందల కోట్లు కొట్టడం చాలా కష్టమే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక త్వరలోనే టిల్లు స్వ్కేర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయబోతున్నారట. ఆ సక్సెస్ మీట్ లో సిద్దూ ఏం మాట్లాడుతారో చూడాల్సిందే. ఇది కూడా చదవండి: కారును ఢీకొట్టిన ఆర్మీ బస్సు..ముగ్గురు మృతి..26మంది జవాన్లకు గాయాలు..! #siddhu-jonnalagadda #tillu-square-collections #tillu-square మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి