Election Counting Day : ఏపీ (Andhra Pradesh) లో ఎన్నికల కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు (Violence) జరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఘర్షణలకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో వాళ్లకి గృహ నిర్బంధంలోనే ఉండాలని నోటీసులు జారీ చేశారు. మరికొందరిని జిల్లా వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. మైదకూరు నియోజకవర్గంలో మొత్తం 52 మందికి నోటీసులు వెళ్లాయి. ముఖ్యంగా ట్రబుల్ మంగర్స్, రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రౌడీ షీటర్ల (Rowdy Sheeters) ను జిల్లా బహిష్కరణ చేసేందుకు సిద్ధమయ్యారు.
Also read: హమ్మా..దేవుని బంగారమే కొట్టేద్దామనుకున్నావా..?
జూన్ 2 నుంచి 7 వ తేదీ వరకు ఆరుగురు రౌడీ షీటర్లకు జిల్లా బహిష్కరణ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అలాగే జూన్ 1 నుంచి 7 వరకు మరో 32 మందిని అరెస్టు చేస్తున్నట్లు కూడా నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం రెవెన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్ (Revenue Divisional Magistrate) వద్ద వీళ్లు హాజరు కావాలంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం.. సంచలన ఆదేశాలు జారీ!