Brain Pressure: ఈ రోజుల్లో పనిభారం, ఆఫీస్‌లో మంచి పనితీరు కోసం ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమతుల్యత దెబ్బతిని మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో మానసిక ఆరోగ్య ప్రభావం ఒత్తిడికి కారణమవుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో, పని ఒత్తిడి, కుటుంబం రెండింటినీ ఏకకాలంలో చూడటం ప్రతి ఒక్కరికి సవాలుగా ఉంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. అంతేకాకుండా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేయలేకపోవడం వలన కొందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఇది తరువాత మానసిక ఆరోగ్య సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో.. ఒత్తిడికి అనేక కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి, ఆపీసులో మంచి పనితీరు, కుటుంబం, స్నేహితులకు సమయం ఇవ్వలేకపోవడం మొదలైనవి ఎక్కువగా చూస్తునే ఉంటాము. ఆ సమయంలో కొన్ని చర్యలను అనుసరించడం ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సులభంగా సమతుల్యం చేసుకోవచ్చు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో సమతుల్యం కోసం మార్గాలు:
- వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి.. సమయాన్ని పాటిచటం నేర్చుకోవాలి. దీని కోసం..ఒక స్థిరమైన టైం ప్రకారం ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుంటే పనిలోనూ పాలుపంచుకోగలుగుతారు.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. బాగా తినడం, మంచిగా నిద్రపోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్స్, నిద్రలేమి ఒత్తిడిని పెంచటంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని నిద్ర, మంచి ఆహారం కోసం ఖచ్చితంగా పాటించాలి.
- వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి..ఆఫీసు కోసం మాత్రమే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం కూడా కొంత సమయం కేటాయించాలి. స్నేహితులతో సరదాగా ఎక్కడికైనా వెళ్తే ఒత్తిడి తగ్గి జీవితం హ్యాపీగా ఉండేలా చేస్తుంది.
- కొందరు వ్యక్తులు మొహమాటం వలన ఏ పనిని తిరస్కరించలేరు. ఇతర వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. దీని కారణంగా.. పనిభారం పెరిగి ఒత్తిడికి గురవుతారు. అందువల్ల, వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఏమీ చేయని అలవాటును పెట్టుకోవాలి.
- కొంత మంది ఆఫీస్ పనిని ఇంట్లో కూడా చేస్తూనే ఉంటారు. దీని వల్ల మిగిలిన సమయం కుటుంబంతో గడపలేరు. ఇది వారి వ్యక్తిగత, వృత్తి జీవితంలో అసమతుల్యతను సృష్టిస్తుంది.
- ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. భావాలను, సమస్యలను సన్నిహితులతో పంచుకుంటే మనస్సు తేలికగా మారుతుంది. వారి సలహా ఉపయోగకరంగా ఉంటే ఒత్తిడిని కూడా తగ్గి మంచి అనుభూతి ఇస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ నాలుగు శరీర భాల్లో వాపు వస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.