పిజ్జా తినడం మెట్రో సిటీస్, నగరాల్లో ఉండే వారికి కామన్. ఇక సాఫ్ట్వేర్ సహా సిటీస్‌లో ఉద్యోగాలు చేసే వారు నిత్యం వీటిని తింటుంటారు. ఎంతో మంది పిజ్జాకు ఫిదా అయిపోయారు. వీలుచిక్కినప్పుడల్లా లాగించేస్తుంటారు. అయితే ఎక్కువ శాతం మంది పిజ్జా అనేది మోడ్రన్ ఫుడ్ అని భావిస్తారు. టెక్నాలజీ కాలంలో కనుగొన్న ఫుడ్ అనుకుంటారు. కానీ పిజ్జాకు ఉన్న పురాతన చరిత్ర గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Also Read:గజదొంగ టైగర్ నాగేశ్వర్రావు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా?
ప్రపంచంలో తొలిసారి పిజ్జా తయారైంది క్రీస్తు పూర్వం 997 సంవత్సరంలో. ఇటలీలోని గేటా నగరంలో మొదటిసారి పిజ్జాను తయారు చేశారు. ఆ తర్వాత ఇటలీ మొత్తం ఈ ఫుడ్ విస్తరించింది.పిజ్జాలు గ్రీకు, ఈజిప్టుల ఆహారం. ఆలివ్ ఆయిల్, మసాలాలలో వాటిని కుక్ చేసుకునే వారు. అయితే క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచి ఇటీలియన్లు పిజ్జాల్లో టమోటాలు యాడ్ చేయడం ప్రారంభించారు. అనంతరం చాలా మంది రకరకాల వెరైటీలు ట్రై చేయడం సహా ప్రపంచమంతా పిజ్జాలు విస్తరించాయి.
1835లో ది త్రీ మస్కిటీర్స్ పుస్తక రచయిత ఇటలీలోని నాపిల్స్ లో పర్యటించారు. అక్కడ పేద వారు వేసవిలో పుచ్చకాయలు, శీతకాలంలో పిజ్జాలు తినేవారని గమనించారు. తరువాత దీని గురించి పుస్తకాల్లో రాసారు.దీంతో అప్పటి వరకు ఎవరికి వారు ఇళ్లలో తయారు చేసుకునే పిజ్జా.. అమ్మడం ప్రారంభమైంది . 1933లో మొట్టమొదటి సారి పిజ్జాను అమ్మారు. ప్యాస్టీ లన్సెరీ అనే వ్యక్తి న్యూయార్క్‌లో పాస్టీస్ పిజేరియా రెస్టారెంట్లో తొలిసారి పిజ్జా అమ్మకానికి ఉంచాడుట.అయితే రిపోర్టుల ప్రకారం 1500వ సంవత్సరంలో పిజ్జాను కనుగొన్నారు. చవుకగా లభించే ఈ పిజ్జాను నేపుల్స్‌కు చెందిన దిగువ తరగతి ప్రజలు వండుకుని తినేవారు. చీజ్‌కు తోడు టమోటా ముక్కలు పిజ్జా రొట్టెపై టాపింగ్ చేసుకుని వారు ఆరగించేవారు అని ఉందిట.
పిజ్జాలు మొదట చతురస్రాకారంలో ఉండేవట. తర్వాత అవి గుండ్రటి ఆకారంలోకి మారాయి. పిజ్జాను తయారు చేసేవారిని ఇటాలియన్‌లో పిజ్జాయిలో అంటారట. రెండో ప్రపంచ యుద్ధ కాలం వరకూ అమెరికన్లను పిజ్జా గురించి తెలియదు. ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికా సిపాయిలు పిజ్జా టేస్ట్‌కు ఫిదా అయి.. ఆ వంటకాన్ని అమెరికాకు తెచ్చారు. ఆ తర్వాత అది అమెరికన్లకు ప్రీతిపాత్రమైంది. ప్రపంచంలో అన్ని చోట్లా బేక్ చేసిన పిజ్జా లభిస్తుంది. అయితే స్కాట్లాండ్‌లో మాత్రం డీప్ ఫ్రై పిజ్జా దొరుకుతుంది. వ్యోమగాముల ఫుడ్ కోసం నాసా తయారు చేసిన 3డి ప్రింటర్‌లో పిజ్జాకు కూడా చోటు దక్కింది.
ఫిలాండెల్ఫియా అనే నగరంలో పిజ్జా మ్యూజియం ఉంది. దీనిపేరు పిజ్జా బ్రెయిన్. ప్రపంచంలోనే అత్యధిక పిజ్జా రకాల కలెక్షన్ ఇక్కడ ఉంది.ఇక అక్టోబర్ ను పిజ్జా మంత్ అని 1984లో నిర్ణయించారు. పిజ్జా టుడే మ్యాగజీన్ పబ్లిషర్ గ్యారీ డర్నెల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని చెబుతున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది అక్టోబర్‌ను పిజ్జా నెలగా జరుపుకుంటున్నారు. మామూలుగా అయితే దీన్ని ఒకప్పుడు అమెరికన్లు మాత్రమే జరుపుకునే వారు కానీ పిజ్జా ఇప్పుడు అన్నీ చోట్లా ఫేవరెట్ ఫుడ్ కాబట్టి మొత్తం ప్రపంచమంతా అక్టోబర్ నెలను పిజ్జా మంత్ గా జరుపుకుంటున్నారు. ఏంజిల్స్‌లో ప్రతి ఏడాది పిజ్జా అంతర్జాతీయ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీన్ని అంతర్జాతీయ పిజా ఎక్స్పో పేరుతో నిర్వహిస్తున్నారు.పిజ్జాలు తయారు చేసే వారికి ప్రపంచ చాంపియన్‌షిప్ సైతం ఉంది. ఇందులో ప్రీస్టైల్ అరోబాటిక్ టాసింగ్. ఫాస్టెస్ డఫ్, లాంగెస్ట్ డఫ్ స్టెచ్ ఇలా చాలా విభాగాలు కూడా ఉన్నాయిట.
చవకగా దొరికే పిజ్జాలతో పాటు అత్యంత ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన పిజ్జా ధర రూ. 7,93,880 రూపాయలు ఉందిట. ఓ అధ్యయనం ప్రకారం వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్ సోకే అవకాశం తక్కువట. అదండీ మన ఎంతో ఇష్టంగా తినే పిజ్జా చరిత్ర. అక్టోబర్ నెల అంతా పిజ్జా మంత్ కాబట్టి మీరు కూడా వీలు దొరికినప్పుడల్లా పిజ్జా తినేయండి, ఎంజాయ్ చేసేయండి.