నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....!

ఏలూరు ప్రభుత్వ జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ర్యాగింగ్ కు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందిని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

New Update
నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం....!

Nursing College Student Suicide Attempt: ఏలూరు ప్రభుత్వ జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలో (Eluru GNM Nusring College) ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఫస్టియర్ విద్యార్థిని ఒకరు ఆత్మాహత్యాయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ర్యాగింగ్ కు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందిని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

కానీ ర్యాగింగ్ కారణంగానే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిందని అధికారులు ధ్రువీకరించడం లేదు. మూడు రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుండటంతో తాళలేక ఆమె నిద్ర మాత్రలు మింగిందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని స్పృహలోకి రాగానే విచారణ జరిపి అసలు విషయాలు తెలుసుకుంటామని అన్నారు.

ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. ర్యాగింగ్ జరిగి వుంటే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మరోవైపు సమాచారం అందుకున్న ఏలూరు పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విద్యార్థిని నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ర్యాగింగ్ ను ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించాయి. ర్యాగింగ్ కు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాల్లో ర్యాగింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ తరుచూ ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తుండటం కలవర పెడుతోంది. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యుల నిర్లక్ష్యానికి బలైన పసికందు

Advertisment
Advertisment
తాజా కథనాలు