/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T203039.541.jpg)
Jr. NTR Clarity About Kantara Prequel : ‘కాంతార’ (Kantara) ప్రీక్వెల్‌లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్ టీఆర్ (Jr. NTR) క్లారిటీ ఇచ్చారు. తల్లితో కలిసి కర్ణాటక వెళ్లిన తారక్.. ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రముఖ దేవాలయాలు తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే కన్నడ మీడియాతో మాట్లాడిన తారక్.. రిషబ్ శెట్టితో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.
Man of Masses @tarak9999 and Rishabh Shetty clicked at Mangalore Airport. pic.twitter.com/7OJZzlchCo
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2024
ఇక ‘కాంతార’ ప్రీక్వెల్‌లో నటిస్తున్నారా అనే ప్రశ్నకు.. అదంతా రిషబ్ శెట్టి (Rishab Shetty) నే ప్లాన్ చేయాలని చెప్పారు. ఆయన ప్లాన్ చేస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం తారక్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ‘కాంతార’ ప్రీక్వెల్ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. 2022లో రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలోనే వచ్చిన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకోగా రూ.450 కోట్లు వసూలు చేసింది.
#NTR fulfills his mother dream of bringing him to her hometown Kundapura in Karnataka. Along with her mother, director Prashanth Neel and Rishab Shetty, #NTR had darshan at Udupi Sri Krishna Matha. pic.twitter.com/bk266eErH6
— Telugucinema.com (@telugucinemacom) August 31, 2024
Also Read : నీట మునిగిన థర్మల్ పవర్ స్టేషన్.. రంగంలోకి దిగిన చంద్రబాబు!