NTR31 : మెక్సికోలో 'NTR 31' షూటింగ్.. మొత్తం 15 దేశాల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్!

NTR 31 ప్రాజెక్ట్ ని ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించబోతున్నారట. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో దేశంలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొత్తం 15 దేశాల్లో షూటింగ్ జరిపేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

NTR31 : మెక్సికోలో 'NTR 31' షూటింగ్.. మొత్తం 15 దేశాల్లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్!
New Update

NTR 31 Movie Shooting Update :  మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా (Jr. NTR) ‘KGF’ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘NTR31’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ తో పాటూ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇక రీసెంట్ గా తారక్ బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Also Read : ‘అఖండ 2’ లో బాలయ్యను ఢీ కొట్టే విలన్ దొరికేశాడు.. బోయపాటి ఊరమాస్ సెలెక్షన్!

15 దేశాల్లో షూటింగ్...

ఈ సినిమాని ప్రశాంత్ నీల్ ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరించబోతున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో దేశంలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ విదేశాల్లోనే జరుగుతుందని, మొత్తం 15 దేశాల్లో షూటింగ్ జరిపేలా మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

దీన్ని బట్టి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీని రెడీ చేసినట్లు స్పష్టమవుతుంది. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

#ntr-31-movie-shooting #prasanth-neel #ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe