NTR31 : ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా లాంచ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఎన్టీఆర్ నటించనున్న 'NTR 31' సినిమా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 9న ఘనంగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

New Update
NTR31 : ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా లాంచ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

NTR - Prashanth Neel Movie : తారక్ ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని 'ఎన్టీఆర్ 31' సినిమా (NTR31 Movie) లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 9న ఘనంగా ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

ప్రభాస్ సలార్ 2 (Salaar 2) ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ సినిమాను ముందుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. కాగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

Also Read : ‘దేవర’ సెకండ్ సింగిల్ పై ట్రోల్స్ .. స్పందించిన నిర్మాత, దేనితో కంపేర్ చేస్తే మనకేంటి అంటూ..!

ఈ ప్రాజెక్ట్‌కు 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మరి మూవీ లాంచింగ్ రోజు ఏమైనా టైటిల్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది.

Advertisment
తాజా కథనాలు