Jr.NTR: బాలీవుడ్ సినిమాలో గూఢచారి గా కనిపించబోతున్న జూనియర్‌ ఎన్టీఆర్!

బాలీవుడ్ మల్టీస్టారర్ అయినటువంటి వార్‌ 2 సినిమాలో హృతిక్‌ రోషన్ తో పాటు ఎన్టీఆర్‌ కూడా తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో తారక్ ఇండియన్‌ గూఢచారిగా కనిపించబోతున్నట్లు పక్కా సమాచారం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ను రైటర్ ఆదిత్య చోప్రా డిజైన్ చేశారని టాక్‌.

New Update
Jr.NTR: బాలీవుడ్ సినిమాలో గూఢచారి గా కనిపించబోతున్న జూనియర్‌ ఎన్టీఆర్!

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర  (Devara) అనే యాక్షన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Jahnvi Kapoor) నటిస్తుంది. ఆర్ఆర్‌ఆర్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ఎన్టీఆర్ చేతినిండా మాత్రం సినిమాలున్నాయి.

తాజాగా తారక్ బాలీవుడ్‌ (Bollywood) మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ మల్టీస్టారర్ అయినటువంటి వార్‌ 2 (War 2) సినిమాలో హృతిక్‌ రోషన్(Hrithik Roshan)  తో పాటు ఎన్టీఆర్‌ కూడా తెరను పంచుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే దీని గురించిన సమాచారం బయటకు వస్తుంది. ఈ చిత్రంలో తారక్ ఇండియన్‌ గూఢచారిగా కనిపించబోతున్నట్లు పక్కా సమాచారం బాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ను రైటర్ ఆదిత్య చోప్రా డిజైన్ చేశారని టాక్‌.

అయితే సినిమాలో హృతిక్‌ , తారక్‌ సన్నివేశాలు ఎలా ఉంటాయనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ చిత్ర షూటింగ్‌ ను మార్చి రెండవ వారంలో జపాన్‌ లో ప్రారంభించబోతున్నట్లు వినికిడి. ముందు హృతిక్‌ మీద సన్నివేశాలను పూర్తి చేసి ఆ తరువాత తారక్‌ తో సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియనున్నట్లు బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి. మరి బాలీవుడ్ మీద కన్నేసిన ఎన్టీఆర్‌ అక్కడ కూడా తన సత్తా చాటుతాడని ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also read: కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!

Advertisment
తాజా కథనాలు