ఢిల్లీకి ఎన్టీఆర్‌ కుటుంబం.. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్‌ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

ఢిల్లీకి ఎన్టీఆర్‌ కుటుంబం.. ఎందుకంటే..!
New Update

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. వారితోపాటు ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్లు ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాల గుర్తు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి వేడుకలు ఈ ఏడాదితో ముగిసింది. దీంతో ఈ నాణెంపై 1923-2023 అని ముద్రించబడి ఉంది.

మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నాతాధికారులతో సమావవేశం కానున్న బాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా అందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని, ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. అనంతరం బాబు ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

#ntr-family #ntr-coin #delhi #chandrababu #kalyan-ram #president #launch #jr-ntr #daupadi-murmu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి