Paytm: పేటీఎం వినియోగదారులకు ఊరట.. UPI సేవలకు గ్రీన్ సిగ్నల్! ఎట్టకేలకు పేటీఎం వినియోగదారులకు ఊరట లభించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా యూపీఐ సేవల్లో పాల్గొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి ఇచ్చింది. By srinivas 14 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Paytm Got Approval for UPI: ఎట్టకేలకు పేటీఎం వినియోగదారులకు ఊరట కలిగించే వార్త వెలువడింది. ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా యూపీఐ సేవల్లో పాల్గొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పేటీఎం యాప్ లో ఉన్న అన్ని హ్యాండిల్స్ ను, అవసరమైన చోట కొత్త పీఎస్పీ బ్యాంకులకు మైగ్రేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని పేటీఎంకు రెగ్యులేటర్ సూచించింది. యూపీఐ లావాదేవీలకు అనుమతి.. ఈ మేరకు 'ఇప్పటికే పేటీఎంలో ఉన్న కొత్త యూపీఐ వినియోగదారులకు మర్చంట్ కొనుగోలు బ్యాంకుగా యెస్ బ్యాంక్ వ్యవహరిస్తుంది. @Paytm హ్యాండిల్ Yes Bank కు రీడైరెక్ట్ చేయబడుతుంది. వినియోగదారులు, వ్యాపారులు యూపీఐ లావాదేవీలు, ఆటోపే ఆదేశాలు నిరంతరాయంగా కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది' అని ఎన్పీసీఐ తెలిపింది. ఇక పేటీఎం కోసం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ (PSP)గా నాలుగు బ్యాంకులు భాగస్వామ్య బ్యాంకులుగా పనిచేస్తాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ లు ఉన్నాయి. ఇది కూడా చదవండి: Drugs case: డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మి అరెస్ట్.. జర్నలిజంపై విమర్శలు! పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు.. ఇదిలావుంటే.. నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎన్పీసీఐ ఇచ్చిన వెసులుబాటు కారణంగా మార్చి 15 తర్వాత యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా చెల్లింపుల కోసం వినియోగదారులు పేటీఎం యాప్ ను ఉపయోగించవచ్చు. #paytm #upi-services #npci #paytm-payment-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి