Polling Centres: ఇక సులవుగా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

నవంబర్‌ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను తెలుసుకునే విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఎలక్షన్ కమిషన్‌ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.

New Update
Elections : రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ!

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అనేక హామీల వరాలు కురిపిస్తూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. అలాగే కొంతమంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్‌ అయిపోతుండటంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే నవంబర్‌ 30న పోలీంగ్ జరగనుండటంతో ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ నేతలు అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరోవైపు టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలను తెలిసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది.

Also read: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్.. కవిత ప్రకటన!

తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. సాధారణ ఎన్నికలు-2023 ఎలక్టోరల్‌ రోల్స్‌లో జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఏ నియోజకవర్గంలో ఎక్కడా, ఎన్ని పోలింగ్ కేంద్రాల ఉన్నాయో ఇందుకు సంబంధించిన వివరాలు వచ్చేస్తాయి.తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో గూగుల్‌ మ్యాప్స్‌ని కూడా నిక్షిప్తం చేసేశారు. అందులో ఓటరు ప్రారంభ సంఖ్య, చివరి సంఖ్య, ఎంతమంది పురుషులు, మహిళలకు ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇలా అన్ని పోలింగ్‌ బూత్‌ల వివరాలను అందుబాటులో ఉంచారు.

Also Read: ఫైనల్‌ సమరానికి సిద్ధం.. మరీ అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ?

Advertisment
తాజా కథనాలు