JOBS: దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని ఎన్‌సీఎల్‌కు చెందిన గనులు/ యూనిట్లలో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 150 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో సాధించిన మార్కులు, ధృవ పత్రాల పరిశీలనతో అభ్యర్థులను ఉద్యోగానికి తీసుకుంటారు. అలాగే రూర్కిలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCL :
1. అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఈ అండ్ టీ) ట్రైనీ- గ్రేడ్-సిలో 9 ఖాళీలుండగా.. ఇందుకోసం అప్లే చేసే అభ్యర్థులు మూడేళ్ల మెట్రిక్యులేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పాసై ఉండాలి.
2. అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (మెకానికల్) ట్రైనీ - గ్రేడ్-సిలో 59 ఖాళీలుండగా ఇందుకోసం మెట్రిక్యులేషన్, మూడేళ్ల మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు.
3. అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ - గ్రేడ్-సిలో 82 ఉద్యోగాలుండగా మెట్రిక్యులేషన్, మూడేళ్ల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పాసైన వారే అర్హులు.
30 సంవత్సరాలు..
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1180 (ఫీజు 1000 + 180 జీఎస్టీ). ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు. డిగ్రీ/ పీజీ /డిప్లొమాలను దూరవిద్య/ పార్ట్‌టైమ్ ద్వారా పూర్తిచేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
రాత పరీక్ష ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఎ టెక్నికల్ పరిజ్ఞానానికి సంబంధించిన 70 ప్రశ్నలుంటాయి. సెక్షన్-బిలో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎప్ అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో 50 మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు పొందాలి.
గమనిక :
దరఖాస్తును నింపే సమయంలోనే పరీక్ష కేంద్రాలను ఎంపికచేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు. పోస్టుల ప్రకారం పరీక్షను వేర్వేరుగా నిర్వహిస్తారు. ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. సబ్జెక్టు సంబంధిత అంశాల నుంచే 70 ప్రశ్నలు వస్తాయి. పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధించాలి. సెక్షన్-బిలో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్-మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలకు వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకోవాలి. వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
2024 ఫిబ్రవరి 05 దరఖాస్తుకు చివరి తేదీ.
అధికారిక వెబ్‌సైట్: www.nclcil.in
ఇది కూడా చదవండి : Cummins : వరల్డ్ కప్ హీరోకే.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు!
CSIR :
రూర్కిలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (CSIR) ప్రాతిపదికన 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు డిప్లొమా (సివిల్/ అర్కిటెక్చర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ జియాలజీ) చదివి ఉండాలి. 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక:
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు 2024 ఫిబ్రవరి 07 చివరి తేదీ. పోస్టు ద్వారా దరఖాస్తు ఫారాలు స్వీకరించడానికి చివరి తేదీ 2024 ఫిబ్రవరి 20
అధికారిక వెబ్‌సైట్: https://cbri.res.in/notifications/recruitments/