Indian Army: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే భారీగా ఆర్మీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..పూర్తివివరాలివే..!! ఈనెల చివరివారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో వెలువడే నోటిఫికేన్ ద్వారా మొత్తం 25వేలకు పైగా ఖాళీలను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. By Bhoomi 20 Jan 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Agniveer Recruitment: ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా మారాలని కలలు కంటున్నట్లయితే, మీకు ఇండియన్ ఆర్మీ (Indian Army)లో భాగం కావడానికి సువర్ణావకాశం ఉంది. అగ్నిపథ్ స్కీమ్(Agnipath Scheme) అనేది దేశసేవ చేయాలనుకునేవారికి ఒక వరం లాంటిది. రక్షణ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం భారత ప్రభుత్వం ఈ స్కీంను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సెలక్ట్ అయ్యే అభ్యర్థులు అగ్నివీర్స్ అంటారు. ఈనెల చివరి వారంలో ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారత సైన్యంలో 4ఏళ్ల సర్వీస్ కోసం అగ్నివీర్స్ ను సెలక్ట్ చేస్తారు. త్వరలో వెలువడే నోటిఫికేషన్ ద్వారా 25వేలకు పైగా ఖాళీలను పలు విభాగాల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. వయస్సు: భారత సైన్యంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయస్సు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అవివాహితులు పురుష, స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ఆర్మీలో పలు విభాగాల్లో అగ్నివీర్స్ ను సెలక్ట్ చేస్తారు. అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 33శాతం మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ పాసై ఉండాలి. కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీస్ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి. క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 50శాతం మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకు కనీసం 33 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై ఉండాలి. ట్రేడ్ మ్యాన్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 33శాతం మార్కులతో 8వ తరగతి పాసై ఉండాలి. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ రిక్రూట్‌మెంట్ అనేది ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా పనిచేయడానికి యువతీ యువకులను ఎంపిక చేసే ప్రక్రియ. అగ్నివీర్‌లు అంటే నాలుగు సంవత్సరాల కాలానికి రిక్రూట్ చేయబడిన సైనికులు, ఆ తర్వాత వారు సాధారణ కేడర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అగ్నివీర్ ర్యాలీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు వారి శారీరక దృఢత్వం, మానసిక సామర్థ్యం, విద్యార్హత ఆధారంగా అంచనా వేయబడతారు. ర్యాలీలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, వ్రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి అనేక పరీక్షలు ఉంటాయి. ఇది కూడా చదవండి: మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు #indian-army #agnipath-scheme #agniveer-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి