Indian Airforce Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అగ్నివీర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in/AVలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీ కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 17, 2024 నుండి షురూ కానుంది. అదే సమయంలో, ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పరీక్ష రుసుమును డిపాజిట్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 6, 2024. అగ్నిపథ్ స్కీమ్ (Agnipath Scheme)కింద ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్‌మెంట్ కోసం ప్రవేశ పరీక్ష మార్చి 17, 2024న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 చివరి తేదీ తర్వాత ఎటువంటి ఫారమ్ ఆమోదించరు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అధికారిక సమాచారాన్ని చదవడానికి ఈ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 17, 2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2024
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 17 మార్చి 2024
స్త్రీ, పురుషుల ఎత్తు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థులకు కనీస ఆమోదయోగ్యమైన ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. ఈశాన్య లేదా ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు కనీస ఎత్తు 147 సెం.మీ గా పేర్కొన్నారు.
దరఖాస్తు రుసుము:
ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 550, జీఎస్టీని ఆన్‌లైన్‌లో ఫీజుగా చెల్లించాలి. చెల్లింపు గేట్‌వే ద్వారా డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 17.5 నుంచి 21సంవత్సరాల లోపు ఉండాలి. అంటే 2004 జనవరి 2 నుంచి 2007 జులై 2 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టులు. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.
జీతం:
ఇందులో ఎంపికైనా అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో జీతం నెలకు రూ.30,000, రెండో ఏడాదిలో రూ.33,000, మూడో సంవత్సరంలో రూ.36,500, నాలుగో సంవత్సరంలో రూ.40,000 జీతం భత్యం చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్!