Railway Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వివిధ కోర్సులు చదవినవారికి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండియన్ రైల్వేస్(Indian Railways) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జైపూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (Railway Recruitment Cell, Jaipur), మొత్తం 1646 ఖాళీలతో కూడిన అప్రెంటిస్షిప్ పొజిషన్(Apprenticeship Position)ల రిక్రూట్మెంట్ చేపట్టింది. జనవరి 2, 2024న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్లో రిక్రూట్ మెంట్ గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. జనవరి 10, 2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే సెక్టార్ లో ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు దశలు, మరిన్నింటితో సహా రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 1646 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ జైపూర్ అప్రెంటిస్ షిప్ పోస్టుల కోసం 1646 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 10 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అధికారిక వెబ్సైట్ https://rrcjaipur.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 చివరి తేదీ.
Translate this News: