JOBS : ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం

ఇండియా టూరిజం సంస్థ తన కంపెనీలో ఉద్యోగాలకు పిలుస్తోంది. టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్ లాంటి వాటిలో ఆసక్తిగల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో జీతం 6 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. వివరాల కోసం కింద చదవండి.

New Update
Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ITDC JOBS : ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌(India Tourism Development Corporation Limited) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ లెక్చరర్, చీఫ్‌తో సహా బోలెడు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాల అప్లికేషన్ ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. ఆన్‌లైన్ దరఖాస్తు(Online Application) ప్రక్రియ ఫిబ్రవరి 21, 2024 నుండి ప్రారంభమవగా.. అప్లయ్ చేయడానికి చివరి తేదీ మార్చి 14,2023. రేపటి వరకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఇంట్రస్ట్ ఉన్న అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చును. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐటీడీసీ(ITDC) అధికారిక వెబ్‌సైట్ https://intranet.itdc.co.in/ లో అప్లై చేసుకోవచ్చును.

ఉద్యోగాల వివరాలు..

అసిస్టెంట్ మేనేజర్ (HO)-6

చీఫ్-3

అసిస్టెంట్ మేనేజర్ (ఈవెంట్స్)-02

అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)-3

అసిస్టెంట్ మేనేజర్ (E&M)-3

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)-1

అసిస్టెంట్ లెక్చరర్ - 4 లతో కలిపి మొత్తం 22 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది.

జీతం..

అసిస్టెంట్ మేనేజర్‌కు సంవత్సరానికి 6.00 లక్షలు ఇస్తారు. లెక్చరర్‌కు సంవత్సరానికి 4.90 లక్షలు ఇస్తుండగా మిగతా వాటికి కూడా వాటి స్థాయికి తగ్గ జీతం ఉంటుంది.

వయస్సు..

అసిస్టెంట్ మేనేజర్,అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులకు వయోపరిమితి 30 ఏళ్ళు.అయితే అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుకు మాత్రం వయోపరిమితి 32 ఏళ్లుగా నిర్ణయించారు.

అర్హతలు..

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ/మూడేళ్ల డిప్లొమా,సంబంధిత రంగంలో అనుభవం కచ్చితంగా ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ సివిల్/E&M కోసం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.. అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఉద్యోగం కోసం కనీసం 55% మార్కులతో ‘లా’ చేసి ఉండాలి.అసిస్టెంట్ లెక్చరర్- NHTET అర్హత కలిగి ఉండాలి. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్‌లో పూర్తి సమయం బ్యాచిలర్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జనరల్ అభ్యర్ధులు అయితే రూ.500 చెల్లింఆలి. అదే ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థుల అయితే మాత్రం వారికి అప్లికేషన్ ఫీజు ఉచితం.

Also Read : Maharashtra : బస్సు మీద దాడి..చేతికి గాయంతో ౩౦కి.మీ నడిపిన డ్రైవర్

Advertisment
తాజా కథనాలు