North Korea : అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా..

ఉ.కొరియా తాజాగా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్‌ వాటర్ డ్రోన్‌ను పరీక్షించింది. ఇటీవల అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేపట్టడంతో దీనికి ప్రతి చర్యగానే ఈ ప్రయోగం చేపట్టినట్లు కిమ్ సర్కార్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

New Update
North Korea : అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ప్రయోగించిన ఉత్తర కొరియా..

Under Water Drone : ఉత్తర కొరియ(North Korea) కవ్వింపు చర్యలకు పాల్పడటంలో రెచ్చిపోతోంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఓ కీలకమైన ఆయుధ వ్యవస్థను పరీక్షించి షాక్ ఇచ్చింది. సముద్రగర్భ డ్రోన్(Under Water Drone) అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వీటిని నిర్వహించింది. ఇటీవల అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేపట్టాయి. ఇందుకు ప్రతిచర్యగానే కిమ్ ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శత్రువులను పసిగడుతుంది

శుక్రవారం తెల్లవారుజామున తమ దేశ తూర్పు తీర జలాల్లో ఉ.కొరియా ఈ పరీక్షలు చేపట్టినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. అణ్వాయుధ సామర్థ్య ఉన్న అండర్‌ వాటర్ డ్రోన్‌ ప్రయోగం చేపట్టామని.. ఇది నీటి అడుగున శత్రువుల కదలికలను పసిగట్టి దాడి చేస్తుందని కిమ్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా(America), దాని మిత్రదేశాల నౌకదళ విన్యాసాలను అడ్డుకునేందుకు తాము ఇలానే స్పందిస్తామంటూ పేర్కొంది.

Also read: భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ..

తీరం నుంచే ప్రయోగించొచ్చు

ఇదిలా ఉండగా.. గతంలో కూడా ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్‌లను ప్రయోగించింది. ప్రత్యర్థుల ఓడరేవులు, నౌకలను లక్ష్యంగా చేసుకోని ఈ డ్రోన్‌లను తీరం నుంచైన ప్రయోగించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సముద్రగర్భ డ్రోన్‌ ఎలా పనిచేస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే వీటికి ఉత్తర కొరియా న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ సామర్థ్యమే ఉంటుందని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు.

యుద్ధం ఎదుర్కోవాల్సిందే

గత కొన్నేళ్ల నుంచి ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌(Kim Jong Un) ఆయుధ ప్రయోగాలు చేస్తూ ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన ప్రభుత్వం చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించిన దక్షిణ కొరియా యుద్ధం ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు చేశారు.

Also read: ఇరాన్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు.. ఇస్లామాబాద్‌లో హై అలెర్ట్!

Advertisment
తాజా కథనాలు