North Korea: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఇటీవల ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ఉ.కొరియా ప్రభుత్వం ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఇది మొదటి మిసైల్ ప్రయోగం కావడం గమనార్హం.

New Update
North Korea: సరిహద్దులో ఉద్రిక్తతల వేళ.. మరోసారి క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించడం వల్లే ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ పరిమాణాల నడుమే ఉత్తర కొరియా ప్రభుత్వం తాజాగా ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అది మొదటి మిసైల్ ప్రయోగం కావడం గమనార్హం. దక్షిణ కొరియా సైన్యం దీన్ని ధృవీకరించగా.. జపాన్ రక్షణశాఖ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

Also read: కరోనా లాంటి మరో వైరస్‌.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..

అయితే గతేడాది డిసెంబర్‌ 18న ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కిమ్‌ జోంగ్ ఉన్ బలగాలు సైతం పశ్చిమ తీరంలో పెద్దఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచింది. ఉత్తర కొరియా చేసిన పనికి దక్షిణ కొరియా సీరియస్‌ అయ్యింది. వాషింగ్టన్, సియోల్‌లు కవ్విస్తే.. వాటిని నాశనం చేసేందుకు ఉండాలని కొత్త సంవత్సరం సందర్భంగా కిమ్‌ తమ దేశ సైన్యానికి పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని కొందరు సైనిక నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

Also Read: అలా చేసినందుకే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం: ఏక్‌నాథ్‌ షిండే

Advertisment
తాజా కథనాలు