Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు

నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కేలా..కార్యకర్తల రుణం తీర్చుకుంటానని బాబు తెలిపారు.

Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు
New Update

CM Chandrababu Naidu About Nominated Posts: గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి మంగళగిరిలోని ఎన్టీయార్ భవన్‌కు (NTR Bhavan) వచ్చిన ఆయన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని తెలిపారు. గత ఐదేళ్ళల్లో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని..అవన్నీ తీరేలా చూస్తానని అన్నారు.

Also Read:Pawan kalyan: అవి నా కళ్ళారా చూశాను.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ!

దాంతోపాటూ ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని మంత్రులు, నేతలు, కార్యకర్తలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు, నేతలు కింది స్థాయి కార్యకర్తలను మర్చిపోకూడదని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేస్తేనే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని దిశా నిర్దేశం చేశారు. అలాగే అన్నా క్యాంటిన్లు తెరిపించేందుకు కూడా ప్రయత్నించాలని చెప్పారు. వందరోజుల్లోనే మూతబడ్డ క్యాంటీన్లను తెరిపించేలా పనులు చేయాలని చెప్పారు.

#andhra-pradesh #cm-chandrababu-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe