Andhra Pradesh: ఏపీ టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం..వారికే నామినేటెడ్ పోస్టులు..! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు. By Manogna alamuru 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TDP Political Bureau Meeting: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారి జాబితా ఇప్పటికే పార్టీకి ఉంది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలకు మంచి స్థానం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నాం అన్నారు.. ఇక, పోలవరం, అమరావతి నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి జరిగే మేలు గురించి చర్చించాం.. కేంద్రం అందించిన సాయంపై పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసిందన్నారు. Also Read:Telangana: సీపీగెట్ – 2024..ఫలితాల విడుదల ఈరోజే.. #andhra-pradesh #tdp #meeting #political-bureau మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి