RC16 Movie: విలన్‌ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా RC16. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూవీలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని తెలుస్తోంది. కథలోని పరిస్థితులే ప్రతినాయక పాత్ర పోషిస్తాయని సమాచారం.

New Update
RC16 Movie: విలన్‌ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్

RC16 Movie: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం RC16. మైత్రీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 20న ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: తొలి సౌత్ ఇండియన్ హీరోగా బన్నీ రికార్డు.. ఏకంగా 25 మిలియన్ ఫాలోవర్స్..!

పరిస్థితులే ప్రతినాయక పాత్ర

ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ ఉండరని టాక్ వినిపిస్తోంది. ఈ కథలోని పరిస్థితులు, హీరోకు ఎదురయ్యే సవాళ్ళే హీరో పట్ల ప్రతినాయక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్ పాత్ర కూడా పాజిటివ్ గా సాగుతోందని సమాచారం. అయితే చరణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కథ ఎంచుకోవడం ఎంతో ఛాలెంజింగ్ విషయని అంటున్నారు నెటిజన్లు.

publive-image

ఇటీవలే జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీ, స్టార్ డైరెక్టర్ శంకర్, సుకుమార్, బోనీ కపూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్ , దిల్ రాజ్, డైరెక్టర్ బుచ్చిబాబు, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా స్క్రిప్ట్ ను అందించారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. బిజినెస్ మెన్ వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'RC16' వంటి భారీ ప్రాజెక్ట్ తో ఆయన నిర్మాతగా పరిచయం అవుతుండడం విశేషం.

publive-image

Also Read: Anchor Sreemukhi: స్టేజ్ పై హీరో చేసిన పనికి.. చెంపపగలగొట్టిన శ్రీముఖి.. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు