BCCI Central Contract Players List: బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. 2023-24 సీజన్ కోసం విడుదల చేసిన ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) , ఇషాన్ కిషన్ (Ishan Kishan) పేర్లు లేవు. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేనిన బోర్డు కాంట్రాక్టు జాబితా నుంచి పేర్లు పీకేసింది. అయ్యర్, ఇషాన్ పేర్లు లేకుండా వార్షిక కాంట్రాక్టుల లిస్ట్ రిలీజ్ చేసింది. అటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh) గ్రేడ్-సీలో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఏ+ గ్రేడ్‌లో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. బీసీసీఐ ఈ ఏడాది 30 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది.
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
గ్రేడ్ A: రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, KL రాహుల్, శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా.
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.
గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కెఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్.
ఆటగాళ్లకు ఎంత డబ్బు వస్తుంది?
గ్రేడ్ Aప్లస్‌లో చేరిన ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు లభిస్తాయి. ఏ గ్రేడ్‌కు రూ.5 కోట్లు, బీ గ్రేడ్‌కు రూ.3 కోట్లు లభిస్తాయి. C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి ఇస్తారు.
అసలేం జరిగిందంటే?
ఐపీఎల్ ఆడాలంటే రంజీలు ఆడాలని బీసీసీఐ ఇటివలే కండీషన్ పెట్టింది. భారత్ జట్టులో ఉండని ఆటగాళ్లు కనీసం నాలుగు రంజీ మ్యాచ్‌లు ఆడితేనే ఐపీఎల్‌లో ఆడిస్తామని రూల్ పెట్టింది. ఇషాన్ కిషన్ రంజీలు ఆడకుండా పాండ్యాతో కలిసి ఐపీఎల్ కోసం ప్రాక్టిస్ చేయడాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. ఇలాంటి డ్రామాలకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్ తీసుకురాగా.. అయ్యర్ అది పాటించకపోగా అబద్ధం చెప్పాడు. గాయమైందని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేశారు. అయితే ఎన్‌సీఏ మాత్రం అయ్యర్‌కు ఎలాంటి గాయం కాలేదని.. అతను ఫిట్‌గానే ఉన్నాడని నివేదికను సబ్మిట్ చేసింది. దీంతో బీసీసీఐకి మండిపోయింది.
Also Read: అబద్ధాలు ఆడి అడ్డంగా దొరికిన శ్రేయస్ అయ్యర్.. ఇలాంటి ఆటగాళ్లని ఏం చేయాలి?
WATCH: