TTD: దయచేసి తిరుమల కళ్యాణ కట్టపై రాజకీయాలు వద్దు.. బోర్డు సభ్యుల విజ్ఞప్తి

లియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని కళ్యాణ కట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య కోరారు.

New Update
Tirupati : తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేకత ఏంటో తెలుసా.?

TTD: తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ.. తాను టీటీడీ బోర్డు మెంబర్ (ttd Board members )అయినప్పటి నుంచి కళ్యాణకట్ట (Kalyana Dam) మీద ప్రత్యేక శ్రద్ధతో అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా తన బాధ్యత నిర్వహిస్తున్నానన్నారు. టీటీడీ యాజమాన్యం కళ్యాణకట్టపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. వెన్నంటి ఉందని కొనియాడారు. విధి నిర్వహణలో తప్పులు జరిగితే తొలగించిన తర్వాత రిక్వెస్ట్ (request)మీద తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని తెలియజేశారు.

తమపై దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలి

తాము అద్దం లాంటి వాళ్ళమని రాయి వేస్తే పగిలిపోతామని, తమకు రాజకీయాలు తెలియదని తెలిపారు. తమ సంస్థకి, కులానికి చెడ్డపేరు రాకుండా ముందుకెళ్తున్నామన్నారు. భక్తుల వద్ద గుండు గీసినందుకు పైకం వసూలు చేస్తున్నామని, ఇది బయటకు రాకుండా అధికారులకు లంచమిస్తున్నట్లు ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. దేవుడి సన్నిధిలో సేవ చేస్తున్న తమపై దుష్ప్రచారాలు (Malicious propaganda) చేయడం మానుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశం (Press conference)లో కళ్యాణకట్ట సంఘం నాయకులు (Leaders of the Kalyanakatta community) పాల్గొన్నారు.

వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి వాహన సేవలు

మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలు ఎలా నిర్వహిస్తారో అదే తరహాలో తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి వాహన సేవలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీటీడీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి (TTD Chairman Karunakara Reddy) మీడియాతో మాట్లాడారు.. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామన్నారు. నవంబరు 9వ తేదీన అంకురార్పణ,10వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన మీడియాకు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఐరన్ లెవెల్స్ పెరగడానికి మార్గాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..?

Advertisment
తాజా కథనాలు