పన్నీరు ముక్కల కోసం పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు కదరా!

పన్నీర్ కోసం పెళ్లి మండపాన్ని పెద్ద యుద్ద భూమిని చేసేశారు కొందరు వ్యక్తులు. పెళ్లి భోజనాల్లో పన్నీర్‌ పెట్టలేదని ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు.

పన్నీరు ముక్కల కోసం పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు కదరా!
New Update

మొన్నా ఆ మధ్య పెళ్లిలో రసగుల్లా పెట్టలేదని ఇరు వర్గాల వారు కుమ్మేసుకున్న ఘటన గుర్తుండే ఉంటుంది కాదా...తాజాగా అలాంటి సంఘటనే ఇంకొటి జరిగింది. అయితే ఈసారి రసగుల్లా కోసం కాదు..పన్నీర్‌ కోసం. పెళ్లి భోజనాల్లో పన్నీర్ పెట్టలేదని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు కొందరు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిదీ, ఎక్కడ జరిగింది అనేది మాత్రం లేదు. పెళ్లి అంటే కొత్త బంధువులు కలిసే చోటు..కొత్త బంధాలు ఏర్పడే చోటు. కానీ అలాంటి చోట ఓ ఫుడ్‌ ఐటమ్‌ కోసం కుర్చీలు విరిగేట్టు కొట్టుకున్నారు ఇక్కడి వారు.

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పన్నీర్ కోసం ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం కనిపిస్తుంది. కేవలం పన్నీర్ కోసం పెళ్లి మండపాన్ని పెద్ద యుద్ద భూమిని చేసేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పన్నీర్‌ కోసం ఏకంగా మూడో ప్రపంచ యుద్దాన్ని చేసేస్తున్నారని కొందరు అంటున్నారు.

Also read: పెన్షన్ దారులకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.3 వేలకు పెంపు!

#wedding #paneer #fighting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe