/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/afcad7f0-eac1-42ad-9395-2e35591bdc2a-jpg.webp)
Emraan Hashmi: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) తోటి నటులు తనను అవసరానికి మించి మర్యాదగా పిలవొద్దంటున్నాడు. సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఆయన తాజాగా తెలుగు హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో వస్తున్న అప్ కమింగ్ మూవీ 'జీ 2' (G2)లో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ ఇందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
The biggest spy franchise gets a blockbuster addition ❤🔥
Boarding mission #G2 🔥
Shoot in progress 💥@AdiviSesh #BanitaSandhu @vinaykumar7121 @peoplemediafcy @AAArtsOfficial @AKentsOfficial @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @MayankOfficl @abburiravi… pic.twitter.com/4pOp2Mi8Qc
— Emraan Hashmi (@emraanhashmi) February 15, 2024
ఈ ఫార్మాలిటీస్ ఎందుకు?
ఈ మేరకు ఇమ్రాన్ ఈ మూవీలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఆయన ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ మూవీ టీమ్ వెల్‌కమ్ చెప్పింది. అంతేకాదు 'జీ 2 యూనివర్స్' లోకి బ్రిలియంట్ యాక్టర్‌కు స్వాగతం. మీతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సర్' అంటూ అడివిశేష్ సైతం పోస్ట్ షేర్ చేశారు. అయితే దీనిపై తాజాగా రియాక్ట్ అయిన ఇమ్రాన్.. 'మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? నన్ను సర్ అని పిలవొద్దు అడివిశేష్. థ్యాంక్స్. త్వరలోనే కలుద్దాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అడివిశేష్ నటించిన హిట్ చిత్రం ‘గూఢచారి’ (Goodachari)కి సీక్వెల్‌గా ‘జీ2’ తెరకెక్కుతోంది. వినయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Ice Water: ఐస్ వాటర్ తాగితే నపుంసకత్వం వస్తుందా?..వైద్యులేమంటున్నారు?
ఇమ్రాన్ ఇప్పటికే ‘ఓజీ’ (OG)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన కీ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదల కానుంది.