Anand Mahindra: పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) భారత్ కు భారీ ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat)...కచ్చితంగా పతకం తీసుకుని వస్తుందనుకుంటే ఆమె 100 గ్రాముల బరువు అధికం వల్ల ఆమె పై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రేజ్లర్ సుసాకి పై భారీ విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగాట్ పై చివరి నిమిషంలో అనర్హత వేటు పడడంతో యావత్ భారత్ షాక్ కు గురైంది.
ఈ అంశం గురించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినేశ్ పై అనర్హత వేటు అనే వార్త నిజం కాకుంటే బాగుండు అంటూ ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఆయన బాధను వ్యక్త పరిచారు.
‘నో ! నో! నో! .. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా, రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడిన పడింది. 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫోగాట్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
దీంతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా ఫోగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్‌కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఫోగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో వినేశ్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది. ఫోగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది.
Also read: రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు!