INDIA కూటమిలో మొత్తం కలిపి 28పార్టీలు ఉన్నాయి. మోదీ మూడోసారి అధికారంలోకి రాకుండా చేయడమే వీరి ప్రధాన ఎజెండా. ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టకకుండా చేయాలని అంతా కలిసిపోయారు. INDIA బ్లాక్‌లో హేమాహేమీలు ఉన్నారు. చాలా మంది ప్రధాని అభ్యర్థులున్నారు. ఇది కాస్త తలనొప్పి తెచ్చే వ్యవహారమే. ఇటీవలి జరిగిన INDIA కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థి గురించి చర్చ జరిగింది. పీఎం అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే(MalliKharjun Kharge)ని ప్రతిపాదించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ(Mamata Benerjee). ఈ ప్రతిపాదనకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మద్దతు తెలిపారు. అయితే లెఫ్ట్ పార్టీలతో పాటు జేడీయూ లాంటి పార్టీలు ఈ ప్రతిపాదనపై నోరు విప్పలేదు. పైగా అసలు పీఎం అభ్యర్థి గురించి చర్చే జరగలేదని చెప్పుకొచ్చాయి. దీనిపై అటు ఖర్గే కూడా క్లారిటీ ఇచ్చారు. పీఎం అభ్యర్థి కూటమీ యూనిటీని దెబ్బతీస్తుందని ఊహించారో ఏమో కానీ.. ఈ అంశం గురించి ఇప్పుడు చర్చ అనవసరమని ఖర్గే చెప్పారు. ముందు గెలవాలని.. తర్వాతే ఏదైనా అంటూ కూటమి నేతలకు సైతం బుజ్జగించినట్టు సమాచారం. ఇక తాజాగా INDIA కూటమి పీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై NCP లీడర్ శరద్‌పవార్(Sharad pawar) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇదంతా ఇప్పుడు అవసరంలేదు:
1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రతిపాదించలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత మొరాజీ దేశాయ్‌ను ప్రధానిని చేశారన్నారు శరద్ పవార్. ముఖాన్ని ప్రొజెక్ట్ చేయనంత మాత్రానా ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రజలు మార్పు కావాలనుకుంటే బీజేపీని ఓడిస్తారని పవార్ అభిప్రాయపడ్డారు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును INDIAకూటమీలోని కొన్ని పార్టీలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఇదే చీలకేనంటూ బీజేపీ కౌంటర్లు:
ఇక పవార్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. శరద్ పవార్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పంచ్‌లు వేశారు. ఖర్గే పేరును దీదీ ముందుకు తీసుకురావడంపై కాంగ్రెస్ కూడా సంతోషంగా లేదని కౌంటర్లు వేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని.. రానున్న(2024) లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోదీని ఆదరిస్తారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కామెంట్స్ చేశారు.
Also Read: చైనా ఆయుధాలతో పాక్ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా?
WATCH: