Fastag:ఫాస్టాగ్‌లకు కేవైసీ లేకపోతే కట్..జనవరి 31 లాస్ట్ డేట్ ఫాస్టాగ్‌లకు కేవైసీ తప్పనిసరి అని చెప్పింది ఎన్‌హెచ్‌ఏఐ చెప్పింది. అలా లేని ఫాస్టాగ్‌లు అన్నింటినీ డీయాక్టివేట్ చేసి బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. దీనికి జనవరి 31 లాస్ట్ డేట్ అని చెప్పింది. By Manogna alamuru 15 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Fastag:కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లకు కాలం చెల్లుతుందని హెచ్చరించింది ఎన్‌హెచ్‌ఏఐ. టోల్ వసూళ్ళను మరింత క్రమబద్ధీకరణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. జనవరి 31 తర్వాత బ్యాంకులు కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది. Also Read:ఇజ్రాయెల్ దాడుల్లో బందీలు చాలామంది చనిపోయారు-హమాస్ ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా కేవైసీ పూర్తిచేయకపోతే అవి బ్ఆక్ అయిపోతాయని తేల్చి చెప్పింది ఎన్‌హెచ్‌ఏఐ. దీని మీద అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్‌ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్‌లను సంప్రదించాలని సూచించింది. ఇక ఇది కాకుండా కొంతమంది ఫాస్టాగ్‌లను కొంత మంది వాహనానికి ముందు భాగ్లో పెట్టకుండి ఇష్టమొచ్చిన చోట పెడుతున్నారని...దాంతో టోల్ ప్లాజాల్లో ఆలస్యం అవడమే కాకుండా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని ఎన్‌హెచ్‌ఏఐ అంటోంది. అలాంటి వారి మీద కూడా చర్యలను తీసుకుంటామని తెలిపింది. మరోవైపు వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను చాలా వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి ఎక్కువ ఫాస్టాగ్‌లను లింక్ చేయడం లాంటివి కూడా చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్నిచోట్ల కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు గుర్తించింది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు ఒకే వాహనం, ఒకే ఫాస్టాగ్ రూల్ అమలు పరచడానికి కూడా ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టింది. #vehicles #toll-gates #toll-plaza #fastag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి