Internet: ఇంటర్‌నెట్‌ వద్దు.. ఆటలే ముద్దు.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాల్సిందిదే!

ఇంటర్‌నెట్‌ను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలకు అనేక మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. కుటుంబ సంబంధాలపై ఇది నెగిటివ్‌గా ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలి. వారితో కలిసి ఆడాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ కాకుండా అవుట్‌డోర్‌ స్పోర్ట్స్‌పై ఫోకస్‌ పెంచేలా చేయాలి.

New Update
Internet: ఇంటర్‌నెట్‌ వద్దు.. ఆటలే ముద్దు.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాల్సిందిదే!

Internet: నేటికాలంలో పిల్లల జీవితంలో ఇంటర్నెట్ ఒక భాగమైయ్యింది. కానీ అధిక ఇంటర్నెట్ వినియోగం పిల్లలకు కూడా హానికరం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకని.. తల్లిదండ్రులు పిల్లలకు ఇంటర్నెట్ సరైన ఉపయోగం గురించి వివరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్‌నెట్‌ను అతిగా ఉపయోగించడం వల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది వారిని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేయడమే కాకుండా వారి కుటుంబ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. పిల్లలు తరచుగా ఫోన్‌లో ఎక్కువ సమయం గడుతూ ఉంటారు. దీని కారణంగా వారి కుటుంబం,  సమాజంలో వారి కనెక్షన్ తగ్గుతుంది. ఇది సామాజిక నైపుణ్యాలు లేకపోవడం, ఒంటరితనం పెరగడానికి దారితీయవచ్చని అంటున్నారు. పిల్లల ఇంటర్నెట్ కనెక్ట్‌పై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నిద్ర సమస్యలు అధికంగా వస్తాయి:

  • ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూడటం వల్ల పిల్లలు నిద్రపోవడం కష్టమవుతుంది. అంతేకాదు ఇది వారి ఆరోగ్యానికి, చదువుకు ఇబ్బందిని కలిగిస్తుంది. రాత్రి సమయంలో ఎక్కువ సేపు ఫోన్‌ చూస్తే ఉదయం లెవటం కష్టంగా ఉంటుంది.

బయట ఆటలకు సమయం ఇవ్వాలి:

  • పిల్లలు ఎక్కువ బయట ఆడినప్పుడు, వారు మరింత చురుకుగా ఉంటారు. ఇది వారు శారీరకంగా అభివృద్ధి చెందడానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు సమయం ఉన్ననప్పుడు తల్లిద్రండులు కూడా వారితో ఆటలకు సమయం ఇస్తే వారిలో మరింత హూశారు పెరిగి ఎక్కవ సేపు ఆడుకుంటారు.

చదువులపై శ్రద్ధ పెట్టాలి:

  • ఇంటర్నెట్ లేకుండా, పిల్లలు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. అందుకని పిల్లల్ని పక్కన కుర్చోబెట్టుకోని వారికి మంచి చదువు నేర్పించాలి. ఇలా చేయకపోతే వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు జీవితంలో ముందుగా సాగలేరు. పిల్లలకు చిన్న వయస్సలోనే చదువు సరిగ్గా చెప్పాలి.

కుటుంబంతో ఎక్కువ సమయం:

  • ఇంటర్నెట్‌కు దూరంగా ఉండటం వలన పిల్లలు వారి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇలా చేస్తే వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. అంతేకాదు సమస్య ఉన్నప్పుడు వారికి కుటుంబ సంబధాల గురించి చెప్పాలి. అప్పుడు వారికి కుటుంబ సభ్యల విలువలు తెలుస్తాయి.

సామాజిక నైపుణ్యాల కోసం:

  • స్నేహితులతో సమయం గడపడం ద్వారా పిల్లల సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు అంటున్నారు. అలాని చెడ్డ విషయాలపై ఎక్కువ ఫోకస్‌ పెట్టవద్దు. ఎందుకు జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మంచి నైత్యుణాలు తెలిసి మిత్రులతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వచ్చి వారి భవిష్యత్తులో ఉపయోగ పడుతాయంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి : మీ భర్త ఇలా ఉన్నాడంటే అతను చాలా బెస్ట్ అని అర్థం.. ఇది తెలుసుకోండి!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు