Telangana: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు..

తెలంగాణలో ఏ ఒక్క హాస్టల్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రిజిస్టర్‌ కాలేదని తేలింది. కేవలం పాఠశాలలు మాత్రమే ప్రభుత్వంతో రిజిస్టర్ అయి ఉన్నాయని.. హాస్టల్స్‌ నమోదు కాలేవని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Telangana: తెలంగాణలో ఒక్క హాస్టల్‌కి కూడా రిజిస్ట్రేషన్ లేదు..
New Update

Telangana Hostels: ఇంటి నుంచి దూరంగా వెళ్లి చదువుకునే పిల్లలు హాస్టల్స్‌లో ఉంటారు. ఇప్పటికీ చాలా హాస్టల్స్‌లో సరైన ఫుడ్ ఉండదు. పరిశుభ్రత ఉండదు. అయితే తెలంగాణలో ఏ ఒక్క హాస్టల్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రిజిస్టర్‌ (Registration) కాలేదని తేలింది. వాస్తవానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌ రైట్స్‌ (NCPCR) నిబంధనల ప్రకారం.. 18 ఏళ్ల కన్నా తక్కువ ఉండే విద్యార్థుల హాస్టల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. కేవలం పాఠశాలలు మాత్రమే ప్రభుత్వంతో రిజిస్టర్ అయి ఉన్నాయని.. హాస్టల్స్‌ నమోదు కాలేవని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Also Read: కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కూటమి జట్టుకు మొదటి మెట్టయిందా?

'రెండేళ్ల క్రితమే ప్రభుత్వం హాస్టల్స్‌కు సంబంధించి ప్రతిపాదనలు రూపొందిచింది. కానీ ఇవి అమల్లోకి రాలేదు. ఎన్‌సీపీసీఆర్‌ నిబంధనల ప్రకారం.. సంబంధిత జిల్లా అధికారి హాస్టల్స్‌కు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్లను జారీ చేయడం మాత్రమే కాదు.. నిబంధనలను కూడా అమలు చేయాలి. ఏదైనా హాస్టల్‌ నిబంధనలు పాటించకుంటే.. ఆ జిల్లా కలెక్టర్‌కు హాస్టల్‌కు ఉన్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం ఉంటుందని' ఆ సీనియర్ అధికారి తెలియజేశారు. అయితే ఇప్పటికీ చాలా హాస్టల్లు నిబంధనలను పాటించడం లేదు. గదులు శుభ్రంగా ఉండటం లేదు, పిల్లలకు సరైన ఆహారం అందించడం లేదు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో.. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉండే ఓ హాస్టల్‌లో సింగిల్‌ బెడ్‌ కోసం నిర్మించిన గదిలో.. ఏకంగా ఏడు బెడ్లను పెట్టారు. ఆ ఇరుకు గదిల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. అలాగే వెంటిలేషన్ లేదు. వాళ్లందికీ షేర్ చేసుకునేందుకు ఒకే బాత్‌రూం ఉంది. అయ్యప్ప సొసైటీలోని మరో హాస్టల్‌ భవనంలో పార్కింగ్‌ స్థలంలో క్యాంటీన్ ఉంది. వాటల్ లీక్‌ అవుతున్నాయి. విద్యార్థులకు సరైన ఫుడ్ పెట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉంటున్నప్పటికీ తమ సమస్యల గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.

Also Read: డీఎస్ మృతిపై మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

తూప్రాన్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి.. ఒకే రూంలో 40 మంది విద్యార్థులు ఉంటున్నారని.. ఫుడ్‌ కూడా అప్పుడప్పుడు తినేలా మాత్రమే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు భద్రత కూడా లేదని మరో విద్యార్థి వాపోయాడు. ఓ హాస్టల్‌లో ఉండి జేఈఈకి ప్రిపేర్‌ అయిన విద్యార్థి మాట్లాడుతూ.. తాను హాస్టల్‌లో ఉండేటప్పుడు అందులో సరైన సౌకర్యాలు లేక ఇద్దరు విద్యార్థులు పారిపోయారని చెప్పాడు. వేడి నీళ్లు కూడా ఉండేవి కాదని.. మా ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకనేవారు కాదని.. అలాగే ఆహారంలో పురుగులు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి హాస్టల్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రిజిస్టర్‌ అయి ఉండాలని.. అలాగే NCPCR నిబంధనలను పాటించని హాస్టల్స్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

#hostels #telugu-news #telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe