Telangana : డీఎస్సీ దరఖాస్తుకు నో ఫీజ్.. తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త! డీఎస్సీ దరఖాస్తుకు ఫీజు వసూలు చేయకూడదని రాష్ట్ర సర్కార్ భావిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు. By B Aravind 06 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి DSC Application : డీఎస్సీ(DSC) దరఖాస్తుకు ఫీజు వసూలు చేయకూడదని రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తోందని.. ఎన్‌ఎస్‌యూఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoori Venkat) వెల్లడించారు. ఈమేరకు ప్రతిపాదనను తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. అలాగే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల ఉంటుందని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని.. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి వారికి న్యాయం చేశారని పేర్కొన్నారు. Also Read: అద్దంకికి మళ్లీ షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన! #telugu-news #telangana-news #dsc-exam #balmoori-venkat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి