Six Guarantees Applications: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆరు గ్యారెంటీల కొరకు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 10 రోజులు ఈ స్వీకరణ సాగుతుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఇవ్వనున్న ఈ పథకాలను పొందేందుకు ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. అయితే గతం సీఎం రేవంత్ చెప్పిన 10 రోజుల్లో డిసెంబర్ 31, జనవరి 1న దరఖాస్తులకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల్లో 2 రోజులు పోగా 8 రోజులే ఈ దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 4 రోజులే ఉండడంతో దరఖాస్తులకు కొరకు తేదీని పొడిగిస్తారనే చర్చ జరగుతుంది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..6 Guarantees: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. ఆరు గ్యారెంటీల దరఖాస్తులకు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తులకు గడువు ముగియనుంది.
Translate this News: