6 Guarantees: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక. ఆరు గ్యారెంటీల దరఖాస్తులకు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తులకు గడువు ముగియనుంది.

New Update
Telangana: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్

Six Guarantees Applications: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీల అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆరు గ్యారెంటీల కొరకు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టింది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 10 రోజులు ఈ స్వీకరణ సాగుతుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఇవ్వనున్న ఈ పథకాలను పొందేందుకు ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూ కడుతున్నారు. అయితే గతం సీఎం రేవంత్ చెప్పిన 10 రోజుల్లో డిసెంబర్ 31, జనవరి 1న దరఖాస్తులకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల్లో 2 రోజులు పోగా 8 రోజులే ఈ దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 4 రోజులే ఉండడంతో దరఖాస్తులకు కొరకు తేదీని పొడిగిస్తారనే చర్చ జరగుతుంది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు

ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు లేదు..

తెలంగాణలో జరుగుతున్న ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు లేదని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar). అనంతరం కిషన్ రెడ్డి చేసిన కాంగ్రస్ బీఆర్ఎస్ ఒకటే అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన అందరికీ తెలుసు అని అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ ఎన్నో సార్లు అవమానించారని తెలిపారు. కేసీఆర్‌ ఇచ్చిన స్క్రీప్టులనే కిషన్‌ రెడ్డి చదువుతారు అని ఆరోపణలు చేశారు. బీజేపీ ఇప్పటివరకు ఎల్పీ నేతను కూడా ఎన్నుకోలేదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు ఆదేశించలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ విచారణ జరిపించటం లేదు అని ఆరోపణలు చేశారు.

ALSO READ: రాక్ష‌స పాల‌న‌లో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్

Advertisment
తాజా కథనాలు