ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరికి నిరాశ ఎదురయ్యింది. కేంద్ర కేబినెట్‌లో ఆమెకు చోట్ దక్కలేదు. ఏపీ నుంచి మొత్తం ముగ్గురు ఎంపీలు గెలిచిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు పురందేశ్వరికి కేంద్రమంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. కానీ చివరికి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేబినెట్ బెర్త్ ఖాయమైంది. అయితే పురందేశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also read: ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా-కాబోయే కేంద్ర మంత్రి ఇంటర్వ్యూ-VIDEO