Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..నో బెయిల్

కవితకు మళ్ళీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.  బెయిల్‌ పిటిషన్‌  రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. 

New Update
Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..నో బెయిల్

MLC Kavitha Bail Petition: కవితకు మళ్ళీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మార్చి 26నుంచి తీహార్ జైల్లో ఉన్న కవిత..తన కుమారుడి పరీక్షల ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే వాదనల సమయంలో బెయిల్ ఇవ్వొద్దని ఈడీ విజ్ఞప్తి చేయడంతో…కోర్టు కవిత పిటిషన్‌ను తోసిపుచ్చింది. కవిత బయటకు వస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ.. కోర్టుకు చెప్పింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు, కవితకు మధ్యంతర బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది.

Also Read: ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా ?

ఇప్పటికే అప్రూవర్‌గా మారిన కొందరిని కవిత బెదిరించారని.. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇందుకోసమే ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వకూడదని.. పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. మరోవైపు ఇటీవల సాధరాణ బెయిల్‌ కోసం కూడా కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఈ నెల 20న విచారించనుంది. ఇదిలాఉండగా.. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో మార్చి 15న ఈడీ ఆమెను అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read: మోడీ రోడ్‌ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు