నిజామాబాద్ ( Nizamabad) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమించిన (love matters) వ్యక్తి మోసాన్ని తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ప్రాణాలు చేసుకుంది. మోసం చేయడంతో పాటు వేధింపులు కూడా తట్టుకోలేక పోతున్నానని బాలిక సూసైడ్ నోట్‌లో రాసి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో జిల్లా కేంద్రంలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అంతేకాకుండా బాలిక రాసిన లేఖను చూసి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా షాక్‌కు గురి అయ్యారు. అర్సపల్లిలో పదోవ తరగతి చదువుతున్న బాలిక..శనివారం రోజు (నిన్న) ఆమె తల్లి కూరగాయల మార్కెట్‌కు రమ్మని పిలిచింది. దీంతో నాకు కళ్లకలక వచ్చింది.. ఇంట్లోనే ఉంటానని అమ్మతో చెప్పింది. తల్లి పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బాలిక చున్నీతో ఉరివేసుకొని దూలానికి వేలాడుతోంది. స్థానికుల సహాయంతో కిందకి దించింది తల్లి. అప్పటికే బాలిక మరణించింది. ప్రేమ విఫలం కావడంతో నా కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సూసైడ్ నోట్‌లో నిందితుడి నెంబర్
బాలిక ఆత్మహత్య కంటే ముందు సూసైడ్ నోట్ (suicide note) ఒకటి రాసింది. అమ్మానాన్నలు జాగ్రత్తగా చూసుకో.. నన్ను క్షమించండి.. నేను ప్రేమ పేరుతో మోసపోయాను.. నన్ను ఒకడు బాగా వేధిస్తున్నాడు.. వాడి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఇక నా జీవితం ముగిసింది. మిమ్మల్ని మిస్ అవుతున్న అంటూ బాలిక సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టిస్తుంది. వేధింపులకు గురి చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్‌ను లేకలో రాసింది బాలిక. ప్రేమించిన వ్యక్తి మైనర్ కావటంతో అందరై షాక్ అయ్యారు.
సీనియర్లు వేధించారు
అయితే పదో తరగతి విద్యార్థిని జోష్ణ ( 10th Class student, Joshna) ఆత్మహత్య వెనకాల సీనియర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోగా సీనియర్లు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. వేధించిన సీనియర్ల (seniors Harassment)పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జోష్ణకి ఎలాంటి చెడు అలవాట్లు లేవని ఆమె అన్న వెల్లడించారు. అంతేకాకుండా ఇంటి వద్ద వచ్చి కూడా రాగింగ్ చేస్తున్నారని జోష్ణ ఇంతకుముందు ఫిర్యాదు చేసిందని అన్నారు. సీనియర్ ఎవరైతే రాగింగ్ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.