Special Status For Bihar: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన బీహార్ JDU పార్టీకి కేంద్రం మొండి చెయ్యి చూపించింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (CM Nitish Kumar) చేసిన డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం తిరస్కిరించింది. అంతకముందు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు బీహార్‌లోని ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ (రామ్ విలాస్) కూడా బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (Central Government) స్పష్టంగా చెప్పింది.దీంతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి.
బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా పాతది. 2000 సంవత్సరంలో బీహార్ నుంచి విడిగా జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. నిజానికి బీహార్ విభజన సమయంలో 90 శాతం పరిశ్రమలు జార్ఖండ్ వాటాకే వెళ్లాయన్నది దీని వెనుక ఉన్న లాజిక్. బీహార్‌లోని కొంత భాగం వ్యవసాయం వరద ప్రాంతాల వల్ల ప్రభావితమైంది. ఇది దాని ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ప్రభావం చూపింది. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు ఆర్థిక సాయం అందించాలి. ఈ వాస్తవాల్లో 100 శాతం నిజం ఉంది. కానీ, బీహార్ విభజన తర్వాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రాజకీయ సమస్యగా మారింది.
Also Read: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య!
జార్ఖండ్ ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్రం
15 నవంబర్ 2000న జార్ఖండ్ ఏర్పడిన సమయంలో, కేంద్రంలో దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి, బీహార్‌లో RJD ప్రభుత్వం ఉన్నాయి. ఆ సమయంలో కూడా అప్పటి బీహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. కానీ కొన్ని సమస్యల కారణంగా అది జరగలేదు.. ఆ తర్వాత 2005లో రాష్ట్రంలో ఆర్జేడీ పాలన ముగిసి, నితీశ్ కుమార్ నేతృత్వంలో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో మార్పు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమి పాలైంది. ఆ తర్వాత కేంద్రంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కూడా అదే పాత ఆట మొదలైంది. నితీష్ మన్మోహన్ ప్రభుత్వం నుండి బీహార్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూనే ఉన్నారు, అయితే రాజకీయ క్రెడిట్ కోసం పోరాటంలో ఈ డిమాండ్ ఎప్పుడూ నెరవేరలేదు.
మోదీ శకం, ప్రత్యేక రాష్ట్రం:
2014లో దేశ, బీహార్ రాజకీయాలు మళ్లీ మారిపోయాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో, బిజెపి (BJP) కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అయితే బిహార్‌లో బిజెపితో జెడియు పొత్తు తెగిపోయింది. ఆ తర్వాత 2015 అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ కలిసి వచ్చాయి. దీని తరువాత, నితీష్ కుమార్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, కొన్నిసార్లు బిజెపితో కొన్నిసార్లు ఆర్జెడితో కలిసి మారారు. కానీ, ఆయన ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌లో అర్థం లేదు. ఎందుకంటే అప్పట్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మిత్రపక్షాల మద్దతుకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మిత్రపక్షాల అవసరం అనివార్యమయ్యాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవటం లో కోల్పొయింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ రూపంలో మిత్రపక్షాలు అవసరమైయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది.